ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 7) నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 19.65 పాయింట్లు(0.05 శాతం) లాభపడి 38,376 వద్ద, నిఫ్టీ 17.20 పాయింట్లు(0.15 శాతం) ఎగిసి 11,351 వద్ద ప్రారంభమైంది. కాసేపట్లోనే సెన్సెక్స్ 100 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆద్యంతం పెద్దగా తేడా లేకుండా స్వల్ప లాభాల్లోనే ట్రేడ్ అయింది. చివరకు సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 38,417.23 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు ఎగిసి 11,355 పాయింట్ల వద్ద ముగిసింది. 1212 షేర్లు లాభాల్లో, 1461 షేర్లు నష్టాల్లో ముగియగా, 187 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఇన్ఫ్రా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, గెయిల్ ఉన్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ 6 శాతం వరకు లాభపడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతుండటం వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపించాయి. డాలర్ మారకంతో రూపాయి 73.34 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడింది.

ఈ రోజు వొడాఫోన్ ఐడియా నుండి కీలక ప్రకటన రానుందనే వార్తల నేపథ్యంలో షేర్ ధర ఉదయం భారీగా పెరిగింది. పెట్టుబడుల గురించి ప్రకటన వస్తుందని భావించారు. దీంతో ఓ సమయంలో 13 శాతం లాభపడింది. బ్రాండ్ పేరుపై ప్రకటన చేయడంతో షేర్ ధర రెండు శాతం కిందకు పడిపోయింది. ఆ తర్వాత టారిఫ్ పెంచుదామని ప్రకటన చేయడంతో మళ్లీ కాస్త పుంజుకుంది. చివరకు 2.90 శాతం లాభంతో రూ.12.40 వద్ద క్లోజ్ అయింది. అమెజాన్, వెరిజాన్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశముంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications