స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 7) ఉదయం అతి స్వల్పలాభాలతో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే నష్టాలదిశగా పయనించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 19.65 పాయింట్లు(0.05 శాతం) లాభపడి 38,376 వద్ద, నిఫ్టీ 17.20 పాయింట్లు(0.15 శాతం) ఎగిసి 11,351 వద్ద ప్రారంభమైంది. 828 షేర్లు లాభాల్లో, 390 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 80 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాల్లోని అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి.
ఉదయం గం.10.45 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, గెయిల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా ఈ రోజు కీలక ప్రకటన చేయనుందనే వార్తల నేపథ్యంలో షేర్ ధర ఓ సమయంలో దాదాపు పది శాతం పెరిగింది. ఆ తర్వాత 5.81 శాతం పెరుగుదలతో షేర్ ధర రూ.12.75 వద్ద ఉంది.

చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, కరోనా మహమ్మారి వ్యాప్తి వేగవంతం కావడం వంటి అంశాలు ప్రభావం చూపాయి ఈ రోజు 52 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ నేడు టాటా మోటార్స్ ఆర్మ్ టీఎంఎల్ హోల్డింగ్స్ రేటింగ్‌ను తగ్గించింది. కాగా, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం 73.16 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. శుక్రవారం 73.14 వద్ద క్లోజ్ అయింది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో ప్రభావం చూపనుంది.


Click it and Unblock the Notifications