సెన్సెక్స్..నిఫ్టీ అప్‌డేట్స్: బీ కేర్‌‌ఫుల్: నష్టాలతో ట్రేడ్ ఆరంభమైన షేర్లు ఇవే..

ముంబై: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాటపట్టిన ప్రభావం మార్కెట్‌పై పడుతున్నట్టే కనిపిస్తోంది.షేర్ మార్కెట్ ఇవ్వాళ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్, నిఫ్టీ.. ఈ రెండు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ట్రేడింగ్ కావట్లేదు. తొలి గంటలో నిరాశ పరిచాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు ట్రేడ్ మార్క్‌గా ఉంటూ వస్తోన్న కొన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల ధరలు నిరాశ పరుస్తున్నాయి. ఇంట్రా డే ఎలా ఉంటుందనేది క్లోజింగ్ నాటికి తెలిసిపోతుంది.

180 పాయింట్ల నష్టంతో..

180 పాయింట్ల నష్టంతో..

సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. నిఫ్టీ కూడా తన బెంచ్‌మార్క్ 17 వేల పాయింట్లకు దిగువగా ట్రేడింగ్‌ను నమోదు చేసుకుంది. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా తొలి గంటలో నష్టపోయాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫార్మాసూటికల్స్ సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లు కొంత నష్టాలతో మొదలయ్యాయి. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు.. బుధవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌తో పోల్చి చూస్తే మూడుశాతం మేర నష్టాన్ని చవి చూశాయి ఇవ్వాళ.

నష్టాలతో మొదలైన షేర్లు ఇవే..

నష్టాలతో మొదలైన షేర్లు ఇవే..

శ్రీ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మాసూటికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. తొలి గంటలో నిఫ్టీలో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, టాటా కన్జ్యూమర ప్రొడక్ట్స్, విప్రో కంపెనీలకు చెందిన షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.. తొలిగంటలో. లాభాలతో ఈ షేర్ల ట్రేడింగ్ మొదలైంది. బుధవారం సాయంత్రం కూడా సెన్సెక్స్ నష్టాలతోనే ముగిసిన విషయం తెలిసిందే.

నిన్నటి పరిస్థిితులే..

నిన్నటి పరిస్థిితులే..

90.99 పాయింట్ల మేర నష్టంతో సెన్సెక్స్ ట్రేడింగ్ క్లోజ్ అయింది. 57,806.49 పాయింట్లతో ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ కూడా 19.65 పాయింట్ల నష్టపోయి 17,213.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లూజర్‌గా నిలిచింది. 1.45 శాతం మేర షేర్ల ధరను కోల్పోయింది. ఐటీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్స్, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మాసూటికల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీ ల్యాబొరేటరీస్, బజాజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

 ఎఫ్ఐఐల విక్రయం..

ఎఫ్ఐఐల విక్రయం..

ఆయా కంపెనీలకు సంబంధించిన షేర్ల ధరల్లో 2.86 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారీగా తమ షేర్లను విక్రయించుకున్నారు. వాటి విలువ 975.23 కోట్ల రూపాయలు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 1,006.93 కోట్ల మేర షేర్లను కొనుగోలు చేశారు. ఇవ్వాళ ట్రేడింగ్ కూడా నష్టాలతో మొదలైంది. సాయంత్రానికి పుంజుకొనే అవకాశాలు లేకపోలేదు. సెన్సెక్స్, నిఫ్టీ ఎంత మేర పాయింట్లను లాభపడతాయా.. లేక నష్టపోతాయా అనేది క్లోజింగ్ అవర్‌లో తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+