ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ మరింత లాభపడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న తిరోగమనాన్ని అధిగమించేలా ఉందివ్వాళ్టి మార్కెట్ పరిస్థితి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే మార్కెట్ ట్రేడ్ అవుతోంది. ఈ వారం తొలిరోజే స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభం కావడం వల్ల మున్ముందు మరింత మంచికాలం ఉంటుందని ఆశిస్తున్నారు.
ప్రారంభంలోనే 500 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. కొద్దిసేపటికే ఇది 700 పాయింట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ మరింత పెరుగుతూ వెళ్లింది. కీలకమైన సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అయ్యాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు దృష్టి పెట్టడం వల్ల ఇంట్రాడే మొత్తం పాజిటివ్ గానే ఉంటుందనే సంకేతాలు స్టాక్ మార్కెట్స్ నుంచి వెలువడుతున్నాయి.

లాభాలతో ప్రారంభంలో సెన్సెక్స్ 53,000 మార్క్‌ను తొలి గంటలోనే దాటేసింది. నిఫ్టీ సైతం లాభాల్లో ట్రేడ్ అయింది. 15,900 పాయింట్లు దాటింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు కొంతమేర లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ టాప్ గెయినర్‌గా నిలిచాయి. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన షేర్లు కూడా అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం- అదాని గ్రూప్స్ స్టాక్స్ మీద సానుకూల ప్రభావాన్ని చూపింది.
ఈ కంపెనీకి చెందిన షేర్ల ధరలు మూడుశాతం మేర పెరిగాయి. టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, మహీంద్ర అండ్ మహీంద్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు భారీగా లాభపడ్డాయి. తొలి గంటలో అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, నెస్ట్లె ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్ల ధరలు కొంతవరకు తగ్గాయి. ఎయిర్ టెల్, ఎల్ అండ్ టీ వంటి షేర్లు శుక్రవారం కూడా తిరోగమనంలోనే కనిపించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్‌లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications