ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 31) అదరగొట్టాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది. సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారి 57,000 పాయింట్లను దాటింది. క్లోజింగ్ సమయానికి 600 పాయింట్లకు పైగా లాభపడి 57,500 పాయింట్లు క్రాస్ చేసింది. నేడు జీడీపీ డేటా విడుదల కానుంది. 2021 క్యాలెండర్ ఏడాది మొదటి అర్ధ సంవత్సరం లేదా FY21 మొదటి త్రైమాసికం జీడీపీ డేటా సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు జోరు మీద ఉన్నాయి.
30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ కేవలం ఆగస్ట్ నెలలోనే 4000 పాయింట్లు లాభపడి 57,000 పాయింట్లను మొదటిసారి క్రాస్ చేసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఉదయం సెషన్ సమయానికే ఆల్ టైమ్ గరిష్టం రూ.2,48,34,296 కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ ఆగస్ట్ 4వ తేదీన మొదటిసారి 54,000 మార్కును దాటింది. ఆ తర్వాత 9 సెషన్‌లలోనే అంటే ఆగస్ట్ 13వ తేదీన 55,000 మార్కును చేరింది. తర్వాత వారం రోజుల్లోపే 56,000 మార్కును దాటిన సెన్సెక్స్, నేడు (ఆగస్ట్ 31) 57,000 మార్కు పైన నిలబడింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.85 శాతం లాభపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా స్టీల్ వరుసగా 2.3 శాతం, 0.92 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 56,995.15 పాయింట్ల వద్ద ప్రారంభమై 57,514.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,859.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,947.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,153.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,915.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 662.63 (1.16%) పాయింట్లు లాభపడి 57,552.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 201.15 (1.19%) పాయింట్లు లాభపడి 17,132.20 పాయింట్ల వద్ద ముగిసింది.

భారతీ ఎయిర్ టెల్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. మెటల్, పవర్ స్టాక్స్ అదరగొట్టాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్ 7.39 శాతం, ఐచర్ మోటార్స్ 4.94 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.43 శాతం, హిండాల్కో 3.73 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.56 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ ఓ వైపు అదరగొట్టగా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు షేర్లు 5.5 శాతం నష్టపోయాయి. ఆగస్ట్ నెలలో సెన్సెక్స్ 8.2 శాతం మేర ఎగిసిపడింది. నిఫ్టీ 17,100 పాయింట్లు దాటింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 26 రాణించాయి. నాలుగు నష్టపోయాయి. నెస్లే ఇండియా 0.29 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.21, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.18, పవర్ గ్రిడ్ 0.85 శాతం చొప్పున నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ సోమవారం 29 పైసలు పెరిగి 73.00 వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ సెషన్‌లలో రూపాయి మారకపు విలువ రూ.1.24 మేర పెరగడం గమనార్హం. సూచీలు పరుగు పెట్టడానికి ఇది కూడా కారణం.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications