స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 3) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీగా లాభపడిన సూచీలు నేడు అంతకుమించిన ఉత్సాహంతో పరుగులు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడం అంతర్జాతీయ సూచీలను కలవరానికి గురి చేస్తోంది. అమెరికా మార్కెట్లు సోమవారం అప్రమత్తంగా కదిలాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లు అలాగే ఉన్నాయి.
అయితే త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం భారత మార్కెట్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయానికి 240 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మధ్యాహ్నానికి దాదాపు 500 పాయింట్లకు పైగా ఎగిసింది.

వరుసగా రెండో రోజు భారీ జంప్
సెన్సెక్స్ ఉదయం 53,125.97 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,486.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,088.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ +565.49 (1.07%) పాయింట్లు లాభపడి 53,516.41 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డును తాకింది. ఉదయం 15,951.55 పాయింట్ల వద్ద ప్రారంభమై నిఫ్టీ, 16,026.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,914.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ 151.45 (0.95%) పాయింట్లు లాభపడి 16,036.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న కూడా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిన్న సెన్సెక్స్ 363.79 (0.69%) పాయింట్లు ఎగిసి 52,950.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122.10 (0.77%) పాయింట్లు ఎగిసి 15,885.15 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.33 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 3.84 శాతం, HDFC 3.33 శాతం, సన్ ఫార్మా 2.93 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.33 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.17 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 1.00 శాతం, గ్రాసీమ్ 0.99 శాతం, జెఎస్‌డబ్ల్యు స్టీల్ 0.82 శాతం, బజాజ్ ఆటో 0.76 శాతం, ఓఎన్జీసీ 0.60 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC, SBI, TCS, సన ఫార్మా, టాటా స్టీల్ ఉన్నయి.

ఇండియన్ రైల్వేస్ స్టాక్
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) నిన్న ఏడు శాతం ఎగబాకి రూ.2,490తో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. నేడు మాత్రం ఈ స్టాక్ దాదాపు నాలుగు శాతం మేర క్షీణించి రూ.2,465.00 వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ స్ప్లిట్ ప్లాన్ నేపథ్యంలో నిన్న స్టాక్ లాభపడింది. ఈ స్టాక్ జూలై 20, 2021 నాడు రూ.2,479.45తో సరికొత్త గరిష్టాన్ని తాకింది. నిన్న ఈ మార్కును దాటింది. నిన్న 2500 దిశగా కనిపించినప్పటికీ రూ.10 దూరంలో నిలిచింది. నేడు మాత్రం కాస్త క్షీణించింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications