Closing bell: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తీరు ఇదీ: షేర్ల లాభ నష్టాలివీ
ముంబై: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాటపట్టిన ప్రభావం మార్కెట్‌పై పడుతున్నట్టే కనిపిస్తోంది. షేర్ మార్కెట్ ఇవ్వాళ ఒకింత నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ.. ఈ రెండు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ట్రేడింగ్ నమోదు చేసుకోలేదు. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా నష్టపోయాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు ట్రేడ్ మార్క్‌గా ఉంటూ వస్తోన్న కొన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల ధరలు నిరాశ పరుస్తున్నాయి. ఇంట్రా డే ట్రేడింగ్ పెద్దగా ఆశించదగ్గ విధంగా కొనసాగలేదు.

నష్టాలతో ఆరంభం.. నష్టాలతో ముగింపు..
సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. నిఫ్టీ కూడా తన బెంచ్‌మార్క్ 17 వేల పాయింట్లకు దిగువగా ట్రేడింగ్‌ను నమోదు చేసుకుంది. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా తొలి గంటలో నష్టపోయాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫార్మాసూటికల్స్ సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లు కొంత నష్టాలతో మొదలయ్యాయి. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు.. బుధవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌తో పోల్చి చూస్తే మూడుశాతం మేర నష్టాన్ని చవి చూశాయి.

క్లోజింగ్ అవర్‌లోనూ..
ఓపెనింగ్ అవర్‌లో ఎలాంటి పరిస్థితులు కనిపించాయో.. క్లోజింగ్‌లోనూ అదే తీరు నెలకొంది. 180 పాయింట్ల నష్టంతో ఆరంభమైన సెన్సెక్స్.. కొంత బెటర్‌గా పెర్‌ఫార్మ్ చేయగలిగింది. తన నష్టాన్ని తగ్గించుకోలిగింది. అంతే తప్ప లాభాల్లోకి ట్రేడ్ కాలేకపోయింది. ఈ ఉదయం 57.882.91 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 0.021 శాతంతో 12.17 పాయింట్ల మేర నష్టపోయింది. 57,885.94 పాయింట్ల వద్ద ముగిసింది.

కొంత పుంజుకొన్నా..
రెండో గంటలో సెన్సెక్స్ పాయింట్లు దూసుకెళ్లాయి. 10:25 నిమిషాలకు గరిష్ఠంగా 57,989.78 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తరువాత మళ్లీ క్షీణించింది. అత్యల్పంగా 57,802.09 పాయింట్లకు దిగజారింది. చివరి అరగంటలో కొంత పుంజుకోగలిగింది. నిఫ్టీ పరిస్థితి దాదాపు ఇంతే. నిఫ్టీ 50 9.65 పాయింట్ల మేర నష్టపోయింది. 17,203 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఈ రెండూ స్వల్పంగా నష్టపోయినందున.. మార్కెట్ వర్గాలు దీన్ని ఫ్లాట్ ట్రేడింగ్‌గా భావిస్తున్నాయి.

నిఫ్టీ 50లో
నిఫ్టీ 50లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఆయా కంపెనీలకు చెందిన షేర్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టాటా స్టీల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. వాటి షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications