Stock Market: భారీ లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 14 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 406 పాయింట్ల లాభంతో 64,487 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 126 పాయింట్లు వృద్ధి చెంది 19, 259 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టాటా మోటర్స్, టైటాన్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, విప్రో, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్, మారుతి, నెస్లే ఇండియా లభాల్లో కొనసాగుతోన్నాయి.
టాటా స్టీల్, ఎన్టీపీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.ముడి చమురు అధిక అస్థిరతను చవిచూడడంతో US డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్‌లు రెండింటిలో లాభాలను పరిమితం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నాయి. US ఫెడ్ నుంచి ఎలాంటి కామెంట్స్ రాకపోయేసరికి డాలర్ ఇండెక్స్, U.S. 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్‌లను తగ్గాయి. డాలర్ ఇండెక్స్ 106 మార్కుల దిగువకు పడిపోయింది. U.S. 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్‌లు కూడా 4.70% దిగువకు పడిపోయాయి. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా వడ్డీ రేట్లను మార్చలేదు. దీంతో మార్కెట్లు గ్రీన్ లో ట్రేడవుతోన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఢిల్లీవేరీ, PB ఫిన్‌టెక్, అఫ్లే (ఇండియా), డేటా ప్యాటర్న్స్ (ఇండియా), JK సిమెంట్, మెట్రోపాలిస్ హెల్త్‌కేర్, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్, ఆర్చిడ్ ఫార్మా, పాలీ మెడిక్యూర్, సువెన్ లైఫ్ సైన్సెస్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జువారీ ఆగ్రో కెమికల్స్ త్రైమాసిక ఆదాయాలను నవంబర్ 4న ప్రకటించనున్నాయి.


Click it and Unblock the Notifications