For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్ మొబైల్ యాప్‌లో భద్రతా లోపం, తప్పిన డేటా లీక్ ముప్పు

|

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్ యాప్‌లో భద్రతా లోపం తలెత్తింది. అయితే సరైన సమయంలో దానిని గుర్తించి సరి చేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్ డేటా లీక్ ముప్పు తప్పినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఎయిర్‌టెల్ యాప్‌లోని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (API)లో ఈ భద్రతా లోపం తలెత్తినట్లు కంపెనీ తెలిపింది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చుఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా శుభవార్త: షరతుల్లేవ్, మళ్లీ ఉచిత కాల్స్.. ఎన్నైనా చేసుకోవచ్చు

ఈ లోపం ద్వారా హ్యాకర్లు కేవలం యూజర్ల ఫోన్ నెంబర్ల ద్వారానే వారి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత వివరాలు పేరు, అడ్రస్, బర్త్ డేట్, మొబైల్ ఐఎంఈఐ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలను హ్యాకర్లు తెలుసుకునే వారని తెలిపింది.

Security flaw in Airtel app exposes customers data, fixed now

అధే జరిగితే 30 కోట్ల మంది యూజర్ల డేటా ప్రమాదంలో పడేది. అయితే ఈ సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే లోపాన్ని సరి చేసినట్లు ఎయిర్ టెల్ స్పష్టం చేసింది. బెంగళూరుకు చెందిన సెక్యూరిటీ రీసర్చర్ ఈ లోపాన్ని గుర్తించి ఎయిర్‌టెల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే దానిని సరి చేసినట్లు ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి తెలిపారు.

English summary

ఎయిర్‌టెల్ మొబైల్ యాప్‌లో భద్రతా లోపం, తప్పిన డేటా లీక్ ముప్పు | Security flaw in Airtel app exposes customers data, fixed now

Airtel was hit with possibly the biggest security bug which could have left the telco’s 300+ million users’ data vulnerable. The security flaw existed in the API of Airtel smartphone app where sensitive information of Airtel users can be found.
Story first published: Sunday, December 8, 2019, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X