ఐపీఓల తర్వాత స్టాక్ ల లిస్టింగ్ విషయంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక ప్రతిపాదన చేసింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (IPO) ముగిసిన తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలలో షేర్ల లిస్టింగ్‌కు పట్టే సమయాన్ని ప్రస్తుతం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించాలని ప్రతిపాదంచింది. ఈ ప్రతిపాదన షేర్ల లిస్టింగ్, ట్రేడింగ్ కోసం టైమ్‌లైన్‌లలో ప్రతిపాదిత తగ్గింపు జారీదారులతో పాటు పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.
"ఇష్యూదారులు సేకరించిన నిధఉలు త్వరగా పొందడం, తద్వారా వ్యాపారం చేయడం సులభతరం అవుతుంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడికి ముందస్తు క్రెడిట్, లిక్విడిటీని కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది" అని సెబీ తన కన్సల్టేషన్ పేపర్‌లో పేర్కొంది. మార్కెట్స్ రెగ్యులేటర్, నవంబర్ 2018లో, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని రిటైల్ ఇన్వెస్టర్‌ల కోసం బ్లాక్ చేసిన మొత్తం (ASBA) ద్వారా సపోర్టు చేసే అప్లికేషన్‌తో అదనపు చెల్లింపు విధానంగా పరిచయం చేసింది. ఇష్యూ ముగిసిన ఆరు రోజులలోపు లిస్టింగ్ కోసం టైమ్‌లైన్‌లను సూచించింది.

ఐపీఓ ప్రక్రియను సులభం చేసేందుకు సెబీ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. సెబీ తన కన్సల్టేషన్ పేపర్‌లో, ఇష్యూ మూసివేసిన తేదీ నుండి పబ్లిక్ ఇష్యూల ద్వారా షేర్లను లిస్టింగ్ తేదీ వరకు ప్రస్తుత ఆరు రోజుల నుండి మూడు రోజులకు (T+3) తగ్గించాలని సూచించడం మంచి పరిణామమని పలువులు అభిప్రాయపడుతున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ ప్రతిపాదనపై జూన్ 3 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.
మరోవైపు మ్యూచవల్ ఫండ్స్ ఏఎంసీలు అంతర్గత నిఘా ఏర్పాటు చేసుకోవాలని సెబీ సూచించింది. ఇలా చేయడం వల్ల మోసాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. గతంలో ఎల్ఐసీ, యాక్సిస్ ఏఎంసీల్లో ఫ్రంట్ లైన్ ట్రోడ్ లు జరిగాయి. దీంతో సెబీ ఏఎంసీలను అంతర్గత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీనిపై కూడా జూన్ 3 వరకు అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరంది.


Click it and Unblock the Notifications