Anil Ambani: అనిల్ అంబానీకి చుక్కలు చూపిస్తున్న సెబీ.. కమ్ బ్యాక్ కష్టాలు, 15 రోజులే టైమ్..
SEBI Notice To Ambani: దాదాపు దశాబ్ధకాలం తర్వాత అంబానీ సోదరుడు అనిల్ తిరిగి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పతనం నుంచి కోలుకుంటున్న ఆయనను గతకాలానికి సంబంధించిన కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అనిల్ తన కంపెనీల అప్పులను ఒక్కొక్కటిగా సెటిల్ చేస్తూ క్రమంగా తిరిగి వ్యాపారవేత్తగా కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వేళ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ నుంచి అనిల్ అంబానీకి సమస్యలు మెుదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ఆరు అనుబంధ కంపెనీలు రూ.154.50 కోట్లు చెల్లించాలని కోరుతూ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజాగా మరోసారి డిమాండ్ చేస్తూ నోటీసు జారీ చేసింది. దీంతో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. అంబానీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గతంలో తన దర్యాప్తులో తేలినప్పుడు భారీగా జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బకాయిలను రానున్న 15 రోజుల్లో సెటిల్ చేసేందుకు గడువు ఇస్తూ తాజాగా మరోసారి నోటీసులు అంబానీ సెబీ నుంచి అందుకున్నారు. దీనిని పాటించటంలో విఫలమైతే.. ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేస్తామని సెబీ హెచ్చరించింది.

ఈ నోటీసులో క్రెస్ట్ లాజిస్టిక్స్, రిలయన్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ హోల్డింగ్స్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. గతంలో సెబీ విధించిన పెనాల్టీలను వీరు చెల్లించటంలో విఫలమైనందున కొత్తగా మరోసారి నోటీసులు అందుకున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు పంపింది. కంపెనీ నుంచి నిధుల మళ్లింపు వ్యవహారంలో రూ.154.50 కోట్లు చెల్లించాలని కోరింది. చట్టవిరుద్ధంగా పొందిన రుణాలను స్వీకరించినందుకు లేదా RHFL నుంచి నిధుల అక్రమ మళ్లింపును సులభతరం చేయడానికి మధ్యవర్తులుగా వ్యవహరించినందుకు ఈ జరిమానాలు విధించబడిందని తెలుస్తోంది.
దీనికి ముందు ఆగస్టులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో డిమాండ్ నోటీసులు వచ్చాయని తెలుస్తోంది. ఆరు వేర్వేరు నోటీసుల్లో.. ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ.25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ వాచ్‌డాగ్ ఆదేశించింది. ఇందులో వడ్డీతో పాటు 15 రోజుల్లోపు రికవరీ ఖర్చులు ఉంటాయి. దీనికి ముందు గతంలో సెబీ అనిల్ అంబానీపై రూ.25 కోట్ల జరిమానా విధించటంతో పాటు ఏదైనా లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ లేదా కీ మేనేజర్ పర్సనల్‌గా లేదా మార్కెట్ రెగ్యులేటర్‌లో రిజిస్టర్ చేయబడిన ఏదైనా మధ్యవర్తిగా సహా సెక్యూరిటీస్ మార్కెట్‌తో అనుబంధించకుండా 5 ఏళ్ల పాటు నిషేధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ని సెక్యూరిటీల మార్కెట్ నుంచి త్ర నెలల పాటు నిషేధించటంతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది.


Click it and Unblock the Notifications