PGIM AMC: పీజీఐఎం ఫండ్ హౌస్ కు రూ.25 లక్షల జరిమానా విధించిన సెబీ.. ఎందుకంటే..

నేషనల్ మార్కెట్స్ వాచ్‌డాగ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Sebi) PGIM అసెట్ మేనేజ్‌మెంట్ కో లిమిటెడ్ కు ఫైన్ విధించింది. సెబీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.రూ. 17,000 కోట్ల ఆస్తులతో భారతీయ ఫండ్ హౌస్‌లలో 23వ స్థానంలో ఉన్న PGIM అసెట్ మేనేజ్‌మెంట్ కో లిమిటెడ్.. ఇంటర్-స్కీమ్ బదిలీలకు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో ఏఎంసీకి రూ.25 లక్షల జరిమానా విధించింది. అలాగే కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజిత్ మీనన్‌కు రూ. 5 లక్షలు, ముగ్గురు ఫండ్ మేనేజర్లు, కుమారేష్ రామకృష్ణన్, పునీత్ పాల్, రాకేష్ సూరిలకు రూ. 2 లక్షల చొప్పున జరిమానా విధించింది. రామకృష్ణన్ నవంబర్ 2021లో ఫండ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం పాల్ ఫండ్ హౌస్ మేనేజర్ గా ఉన్నాడు.

 Sebi fines PGIM AMC, its CEO, fund managers for inter-scheme transfers during credit crisis

PGIM AMC దాని క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్ నుంచి ఓపెన్-ఎండ్ ఫండ్స్‌కి తక్కువ నాణ్యమైన సెక్యూరిటీలను బదిలీ చేసింది.ఇది 2018లో జరిగింది. ఈ మధ్యే సెబీ.. కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కో లిమిటెడ్‌ కు కూడా జరిమానా విధించింది. సెబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైన్ విధించింది. PGIM AMC విషయంలో, రెగ్యులేటర్ 315 ఇంటర్-స్కీమ్ బదిలీలను గుర్తించింది.అక్టోబర్ 2018లో జోరాబత్ షిల్లాంగ్ ఒత్తిడితో సెక్యూరిటీలను PGIM మీడియం టర్మ్ ఫండ్ నుంచి PGIM ఫిక్స్‌డ్ డ్యూరేషన్ ఫండ్‌కు బదిలీ చేసినట్లు సెబీ పేర్కొంది. PGIM AMC తన చర్యలను సమర్థించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+