ఉక్రెయిన్ పైన యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా పైన కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే స్విఫ్ట్ నుండి ఆ దేశాన్ని కత్తిరించాయి. కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇబ్బందికరంగా మారాయి. రష్యా పైన కఠిన ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలు, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో మార్కెట్ కుప్పకూలుతోంది. గతవారం మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. ఇప్పుడు కూడా పతనమవుతున్నాయి. అయితే రష్యాపై ఆంక్షలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ కూడా షాకింగ్ నిర్ణయం తీసుకున్నది.
ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం ఆర్థిక ఆంక్షలతో కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక ఆంక్షలకు గురైన సంస్థలతో నిర్వహించే ట్రాన్సాక్షన్స్‌ను ప్రాసెస్ చేయబోమని ఎస్బీఐ తన కస్టమర్లకు సమాచారాన్ని అందించిందని తెలుస్తోంది. రష్యా సంస్థల్లో ఉన్న పెట్టుబడుల వివరాల గురించి తెలియజేయాలని దేశీయ చమురు కంపెనీలతో పాటు ఎరువుల సంస్థలను ఎస్బీఐ కోరింది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, ఐక్య రాజ్య సమితి ఆంక్షల నేపథ్యంలో బ్యాంకులు, నౌకాశ్రయాలు, ఓడల కంపెనీలతో నిర్వహించే ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ నిలిపివేసినట్లు తెలిపింది.

అంతర్జాతీయంగా విస్తరించి ఉన్నామని, కాబట్టి అమెరికా ఈయూ నిబంధనల మేరకు పని చేయాల్సి ఉందని, వాటిని పాటించకుండా ఉండలేమని బ్యాంకు అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా, తమకు మరింత ముడిచమురు సరఫరా చేయాల్సిందిగా గల్ఫ్ దేశాలను భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ అడుగుతోందని తెలుస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications