ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అప్‌డేట్ వెలువడించింది. ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన అప్‌డేట్ అది. ఎస్బీఐ ఖాతాదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్‌లైన్ కంప్లైంట్స్ విభాగం కొన్ని గంటల పాటు స్తంభించిపోనుంది. దీనితోపాటు ఆన్‌లైన్ రిక్వెస్టులు కూడా పనిచేయబోవు. ఏడు గంటల పాటు ఈ ఆన్‌లైన్ కంప్లైంట్స్, రిక్వెస్టుల విభాగం నిలిచిపోనుంది. ఈ రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జామున 6 గంటల వరకు ఆ సెగ్మెంట్స్‌కు సంబంధించిన సేవలు ఏవీ అందుబాటులో ఉండవు.
మెయింటెనెన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆన్‌లైన్ కంప్లైంట్స్ సెల్‌ను స్తంభింపజేయనుంది. మరింత మెరుగైన సేవలను తమ ఖాతాదారులకు అందించడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఏడు గంటలపాటు ఆన్‌లైన్ కంప్లైంట్స్, రిక్వెస్టుల సేవలను షట్‌డౌన్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ షట్‌డౌన్ సమయంలో ఖాతాదారులు ఇబ్బందులకు గురి కాకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది.

ఈ డౌన్‌టైమ్‌లో ఖాతాదారులు తమ ఫిర్యాదులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లడానికి ఆయా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించుకోవచ్చు. 24 గంటల పాటు అందుబాటులో ఉండే ఎస్బీఐ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చు. అనధికారిక ట్రాన్సాక్షన్స్ వంటి ఇతర కంప్లైంట్లపై ఫిర్యాదు చేయడానికి ఎస్బీఐ టోల్‌ఫ్రీ నంబర్లు 1800112211/18001234/18002100లకు ఫోన్ చేయవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications