For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్‌పీసీఐకి భారీ షాక్‌ ఇవ్వబోతున్న ఎస్‌బీఐ, త్వరలో సొంత డిజిటల్‌ సేవల సంస్ధ...

|

2008లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకుల సమాఖ్య ఉమ్మడిగా నెలకొల్పిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుత్తాధిపత్యం దిశగా సాగుతోంది. దీన్ని అంగీకరించలేని బ్యాంకులు ఇప్పటికే మౌనంగానే ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా రిటైల్‌ చెల్లింపుల విషయంలో బ్యాంకులకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని భావిస్తున్నాయి. దీంతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) స్ధానంలో కొత్తగా మరో రిటైల్‌ టెల్లింపుల వ్యవస్ధను నెలకొల్పడం ద్వారా దీని గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమవుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రిటైల్‌ చెల్లింపుల సేవలు అందిస్తున్న ఎన్‌పీసీఐ మొత్తంగా 60 శాతం లావాదేవీలను నియంత్రిస్తోంది. ఇందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎం‌పిఎస్), భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) తో పాటు మరికొన్ని సేవలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో శరవేరంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ చెల్లింపుల విభాగంలో తానే నేరుగా ప్రవేశించాలని భావిస్తున్న ఎస్‌బీఐ.. తద్వారా ఎన్‌పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకుంది. రూ.500 కోట్ల రూపాయలు నికర పెట్టుబడితో ఈ సంస్ధను ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ఎస్‌బీఐ ఈ మేరకు లాంఛనాలు పూర్తి చేస్తోంది.

sbi mulling over new retail payments platform to counter npci soon

బోగస్ జియోమార్ట్ వెబ్‌సైట్స్, రిలయన్స్ రిటైల్ హెచ్చరికబోగస్ జియోమార్ట్ వెబ్‌సైట్స్, రిలయన్స్ రిటైల్ హెచ్చరిక

తాము కొత్తగా ఏర్పాటు చేసే కొత్త డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్ధలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులను కూడా ఎస్‌బీఐ ఆహ్వానిస్తోంది. తాను ప్రధాన ప్రమోటర్‌గా ఉంటూ మిగిలిన వారితో కలిసి కన్సార్టియం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులకు 2021 జనవరి వరకూ గడువు ఉండటంతో ఆ లోపు ఈ ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ భావిస్తోంది. ఎస్‌బీఐ కొత్త డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్ధ ప్రారంభమైతే ఇక ఎన్‌సీపీఐతో పాటు అందులో భాగస్వాములుగా ఉన్న బ్యాంకులకూ చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.

English summary

ఎన్‌పీసీఐకి భారీ షాక్‌ ఇవ్వబోతున్న ఎస్‌బీఐ, త్వరలో సొంత డిజిటల్‌ సేవల సంస్ధ... | sbi mulling over new retail payments platform to counter npci soon

sbi new retail payments platform to counter npci, sbi plans on new retail payments system, sbi to challenge the monopoly of npci with new retail payments platform soon
Story first published: Saturday, August 29, 2020, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X