ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది మందగమనం, ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా వడ్డీరేట్లను తగ్గిస్తోంది. రెపో ఆధారంగా ఈ ప్రయోజనాలను వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐతే తాజాగా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లను తగ్గించి క్లిష్ట సమయంలో కస్టమర్లకు ఉపశమనం కల్పిస్తోంది.

వడ్డీ రేట్లు తగ్గింపు... 14వసారి
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) రేట్లను 5 బేసిస్ పాయింట్ల నుండి 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో కరోనా కాలంలో రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం కలగనుంది. ఎస్బీఐ తాజాగా తగ్గించిన వడ్డీ రేట్లు జూలై 10వ తేదీ నుండి అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు బ్యాంకు ప్రకటన చేసింది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం వరుసగా ఇది 14వసారి.

6.65 శాతానికి తగ్గింపు
ఎస్బీఐ తాజా తగ్గింపుతో ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు 6.65 శాతానికి తగ్గింది. జూన్ నెలలో బ్యాంకు తన ఎంసీఎల్ఆర్, ఈబీఆర్ రేట్లను 25 బేసిస్ పాయింట్ల నుండి 40 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఏడాదికి 7 శాతం దిగువకు పడిపోయింది. రెపో రేటులో కూడా బ్యాంకు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే కేవలం షార్ట్ టర్మ్ లోన్లకే వడ్డీ రేట్లకే ఈ తగ్గింపు వర్తిస్తుంది. మూడు నెలల కాలపరిమితి వరకు తగ్గించింది.

ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లు
- ఓవర్ నైట్ ఇదివరకు 6.70 శాతంగా - ఇప్పుడు 6.65 శాతం
- వన్ మంత్ ఇదివరకు 6.70 శాతంగా - ఇప్పుడు 6.65 శాతం
- మూడు నెలలు ఇదివరకు 6.75 శాతంగా - ఇప్పుడు 6.65 శాతం
- ఆరు నెలలు ఇదివరకు 6.95 శాతంగా - ఇప్పుడు 6.95 శాతం
- వన్ ఇయర్ ఇదివరకు 7.00 శాతంగా - ఇప్పుడు 7.00 శాతం
- టూ ఇయర్ ఇదివరకు 7.20 శాతంగా - ఇప్పుడు 7.20 శాతం
- త్రీ ఇయర్ ఇదివరకు 7.30 శాతంగా - ఇప్పుడు 7.30 శాతం
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications