న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. తగ్గించిన వడ్డీ రేట్లను మే 27 అంటే నేటి నుంచి అమల్లోకి తీసుసొస్తున్నట్లు ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
సుమారు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఇకపై 7 నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.9 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.

46 నుంచి 179 రోజులకు 3.9శాతం, 180-ఏడాది వరకు 4.4 శాతం, ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు 5.1 శాతం, మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 5.3 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.4శాతం వడ్డీ రేట్లను అందించనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
సీనియర్ సిటిజిన్లకు సవరించిన వడ్డీ రేట్లకు 50 బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ జమ చేయనున్నట్లు తెలిపింది. అంటే 3 నుంచి 5 ఏళ్ళ వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా, ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 5.8 శాతం చెల్లించనున్నారు. ఇక ఐదు నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై 6.2 శాతం చెల్లించనున్నారు. వచ్చే సెప్టెంబర్ 30 వరకు ఈ వడ్డీ రేట్లు అమలులో ఉండే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications