ఎస్బీఐ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం: కస్టమర్లు సహకరించాలని వినతి, ఏటీఎంలు ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీలు కాకపోవడంతో చాలా మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఎస్బీఐకి సంబంధించిన యోనో యాప్ కూడా పని చేయట్లేదు. కనెక్టివిటీలో లోపం కారణంగానే ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగిందని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు వెల్లడించింది.

కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో కనెక్టివిటీ సమస్య ఏర్పడింది. దీంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్లు మినహా అన్ని ఛానళ్లు ఆగిపోయాయి.
We request our customers to bear with us. Normal service will resume soon.#SBI #StateBankOfIndia #ImportantNotice #YONOSBI #OnlineSBI pic.twitter.com/dDFAgmGLQl
— State Bank of India (@TheOfficialSBI) October 13, 2020
'అంతరాయానికి చింతిస్తున్నాం. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తాం. ఇలాంటి సమయంలో కస్టమర్లు అండగా నిలవాలని కోరుకుంటున్నాం' అని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అన్‌లైన్ సర్వీసులకు అంతరాయం కలిగినప్పటికీ ఏటీఎం సేవలు మాత్రం కొనసాగుతున్నాయి.
అంతేగాక, మధ్యాహ్నం నాటికి సర్వీసులు మళ్లీ ప్రారంభమవుతాయని గ్యారెంటీ ఇస్తున్నాం. మాకు సహకరించాల్సిదిగా కస్టమర్లను కోరుతున్నాం. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేయని ఎస్బీఐ వెల్లడించింది. కాగా, అక్టోబర్ 10న ఎస్బీఐ.. తన కస్టమర్లకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్బీఐ, యోనో యాప్ అక్టోబర్ 11, అక్టోబర్ 13న అండర్ మెయింటెనెన్స్‌లో ఉంటాయని పేర్కొంది.