అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఇబ్బందులు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన కార్పోరేట్ రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్బీఐ తదుపరి చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అనిల్ అంబానీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన రూ.1,200 కోట్లు (158 మిలియన్ డాలర్లు) కోట్ల బకాయిలు వసూలుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మొత్తానికి అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు.

రిజల్యూషన్ ప్రొఫెషనల్స్ నియామకం
ఈ రుణాలకి సంబంధించి ఎస్బీఐ.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లింది. వీటి చెల్లింపుల కోసం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరింది. అయితే దీనిపై సమాధానం ఇచ్చేందుకు అనిల్ అంబానికి న్యాయస్థానం వారం రోజులు సమయం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ADAG)కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రెటెల్ లిమిటెడ్‌కు సంబంధించి తీసుకున్న రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు.

రుణ పరిష్కార ప్రణాళికకు ఆమోదం
ఈ నేపథ్యంలో దివాలా చట్టం ప్రకారం అనిల్ నుండి రూ.1200 కోట్లను వసూలు చేసేందుకు ఎస్బీఐ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ రుణం కార్పోరేట్ అంశానికి సంబంధించినదని, అనిల్ అంబానీ వ్యక్తిగత రుణానికి చెందినది కాదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రుణ పరిష్కార ప్రణాళికని రుణదాతలు మార్చిలోనే ఆమోదించారని, ట్రైబ్యునల్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. వీటికి అనుగుణంగా అనిల్ అంబానీ సమాధానం ఇస్తారన్నారు.

చైనా బ్యాంకులకు కొత్త చిక్కులు
అనిల్ అంబానీ కేసులో చైనా బ్యాంకులకు కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. చైనీస్ బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే యూకే కోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. రుణ పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతమయ్యేందుకు భారత బ్యాంకులకు వెళ్లాలని కూడా చైనా బ్యాంకులు భావిస్తున్నాయట. ఎస్బీఐ అంశానికి సంబంధించి దాదాపు రెండేళ్ల తర్వాత కదలిక వచ్చింది. ఈ చర్య చైనా బ్యాంకులకు.. అనిల్ అంబానీ రుణ ప్రక్రియ ఆలస్యం చేయవచ్చునని అంటున్నారు. RComకు రుణాల కోసం వ్యక్తిగత హామీ ఇచ్చారని చైనా బ్యాంకులు చెప్పగా, అనిల్ అంబానీ మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు.

అంబానీ ఆస్తులు సున్నా..
ఇప్పటికే తన నికర ఆస్తుల విలువ సున్నా అని అనిల్ అంబానీ యూకే కోర్టుకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఎస్బీఐకి, ఇటు చైనీస్ బ్యాంకులకు రుణాలు తిరిగి పొందటం అంత సులభమేమీ కాదని భావిస్తున్నారు. ఇప్పటికే తన కంపెనీలలోని తన వాటాలలో ఎక్కువ మొత్తాన్ని అంబానీ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టారు. ఎస్బీఐ వ్యాజ్యం నేపథ్యంలో చైనా బ్యాంకులు మరింత కాలం వేచి ఉండక తప్పని పరిస్థితులు అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications