SBI Home loan: బిగ్గెస్ట్ రికార్డ్: ఒక్క మిస్డ్ కాల్‌తో: రూ. 5 లక్షల కోట్లు
ముంబై: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)... ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.. ఎవరూ అందుకోలేని లక్ష్యాన్ని ఛేదించింది. గృహ రుణాల సెక్టార్‌లో ఏకంగా అయిదు లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించింది. వచ్చే నాలుగేళ్లలో సాధించడానికి మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఏడు లక్షల కోట్లను చేరుకోవాలని భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, లాక్‌డౌన్‌లో రియల్ ఎస్టేట్ సెక్టార్ కుదేల్ అయినప్పటికీ.. ఎస్బీఐ వెనుకంజ వేయలేదు. భారీ టార్గెట్‌ను అందుకోగలిగింది.

రూ.89 వేల కోట్ల నుంచి
ఎస్బీఐకి చెందిన ది రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) ఈ ఘనతను సాధించింది. ఈ యూనిట్ పరిధిలో ఉన్న అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏఎంయూ) విలువ 2011 నాటికి 89 వేల కోట్ల రూపాయలే. పదేళ్లు తిరిగేటప్పటికీ.. అయిదు రెట్లను పెంచుకోగలిగింది. అయిదు లక్షల కోట్ల రూపాయలను అధిగమించగలిగింది. లాక్‌డౌన్ వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాల్లో ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో నమోదు కానప్పటికీ.. ఈ మార్క్‌ను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఒక్క మిస్డ్ కాల్‌తో..
వచ్చే నాలుగేళ్లలో ఇప్పుడున్న అయిదు లక్షల కోట్ల టార్గెట్‌ను ఏడు లక్షల కోట్ల రూపాయలకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి హోమ్ లోన్ సెగ్మెంట్ కార్యకలాపాల్లో అనూహ్య పురోగతి కనిపించిందని, రుణాల చెల్లింపులు భారీ ఎత్తున చోటు చేసుకున్నాయని అన్నారు. రుణ గ్రహీతల సౌకర్యం కోసం కొత్తగా 7208933140 నంబర్‌కు మిస్డ్ కాల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ సెగ్మెంట్‌లో పురోగతి సాధించడానికి ఇది ఓ కారణమైందని అంచనా వేశారు.

ప్రజల్లో ఉన్న నమ్మకమే..
తమ బ్యాంకు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ పురోగమనానికి ప్రధాన కారణమని దినేష్ ఖారా చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామని, అందులో భాగంగా ఒక్క మిస్డ్ కాల్‌తో హోమ్ లోన్‌ను అందించే వ్యవస్థను ప్రవేశపెట్టామని అన్నారు. గృహ రుణాలను మంజూరు చేయడంలో డిజిటల్ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ రిటైల్ లోన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. హోమ్ లోన్ మార్కెట్‌ను కూడా లీడ్ చేసే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం..
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్, రక్షణ శాఖ ఉద్యోగుల కోసం ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్, ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్బీఐ స్మార్ట్ హోమ్, టాప్ అప్ లోన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామని దినేష్ ఖారా వివరించారు. ఎస్బీఐ ఎన్ఆర్‌ఐ హోమ్ లోన్, ఎస్బీఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్, మహిళల కోసం ఎస్బీఐ హర్ ఘర్ వంటివి అమల్లో ఉన్నాయని, వాటన్నింటికీ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్మించే ప్రాజెక్టులకు ఎస్బీఐ ఒక్కటే సెంట్రల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి 1,94,582 పీఎంఏవై గృహాలకు రుణాలను మంజూరు చేసింది.


Click it and Unblock the Notifications