PPF: పీపీఎఫ్‍తో పన్ను మినహాయింపు పొందండి..
చాలా మంది ఆదాయం లేదని పొదుపు చేయడం మానేస్తుంటారు. కానీ చిన్న మొత్తంలో కూడా పొదుపు చేస్తే భారీ మొత్తం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కచ్చితమైన ఆదాయం వస్తుంది. అందుకే చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పొదుపు చేస్తుంటారు. అయితే కొంత మంది ఉద్యోగులు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. వారికి 80(సి) కింద పొదుపు పథకాల్లో పొదుపు చేస్తే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా పీపీఎఫ్ లో పొదుపు చేస్తే కచ్చితమైన రాబడి వస్తుంది.
అలాగే పీపీఎఫ్ ద్వారా రూ.1,50,000 లను 80(సి) చూపించుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ మీరు బ్యాంకులు, పోస్టాఫీస్ ల్లో తెరవొచ్చు. పీపీఎఫ్ లో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టొచ్చు.. లేదా నెలనెలా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 పెట్టుబడి పెట్టాలి లేకుంటే అకౌంట్ ఇన్ యాక్టివ్ అవుతోంది. అయితే పీపీఎఫ్ లో భద్రత ఉంటుంది.. కానీ రాబడి ఎలా ఉంటుందని మీరు సందేహం వ్యక్తం చేయ్యొచ్చు.

ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. పీపీఎఫ్ లో మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. పీపీఎఫ్ లో 15 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. ఆ లోపల మీకు ఏమైనా అత్యవసరం ఉంటే అందులోంచి లోన్ కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.12,500 చొప్పున సంవత్సరానికి రూ.1,50,000 పెట్టుబడి పెడితే అది 15 సంవత్సరాల్లో రూ.22,50,000 కడతారు. మీకు 7.1 శాతం లెక్కన వడ్డీ రూ.18.18 లక్షలు వస్తుంది. అంటే మొత్తం రూ.40 లక్షల వరకు వస్తాయి.
మీరు పెట్టుబడిని మరో ఐదేళ్ల పెంచితే మీకు వచ్చే మరింత పెరుగుతోంది. అయితే పీపీఎఫ్ అకౌంట్ ను భారతీ పౌరులు మాత్రమే తెరిచే అవకాశం ఉంటుంది. పిల్లలపై పేరుపై కూడా పీపీఎఫ్ అకౌంట్ తీయ్యొచ్చు.


Click it and Unblock the Notifications