For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విస్ బ్యాంకులో మహారాష్ట్ర రాజ కుటుంబ దంపతులకు ఖాతా, అకౌంట్ వివరాలు అడిగిన భారత్

|

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్‌మెన్, అధికారులు డబ్బులు దాచుకుంటారనే విషయం తెలిసిందే. రాజకుటుంబాలు కూడా ఈ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున నిధులు కూడబెట్టుకున్నాయి. ఇండియా - స్విస్ మధ్య కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం ప్రకారం అక్కడి బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి పేర్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ రాజకుటుంబానికి స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లుగా వెల్లడైంది.

కాల్స్, డేటా డిసెంబర్ 1 నుంచి ఇక భారం, కస్టమర్‌పై రూ100 వరకుకాల్స్, డేటా డిసెంబర్ 1 నుంచి ఇక భారం, కస్టమర్‌పై రూ100 వరకు

వీరి పేరుపై ఖాతాలు...

వీరి పేరుపై ఖాతాలు...

ఈ ఖాతా వివరాలు వెల్లడించాలని భారత ఐటీ అధికారులు, స్విట్జర్లాండ్ అధికారులను భారత్ కోరింది. సాంగ్లీ రాజ దంపతులు విజయ్ సింగ్ మాధవరావు పట్వార్ధన్, రోహిణి విజయసింగ్ పట్వార్ధన్ పేరు మీద ఈ ఖాతా ఉన్నట్లు తెలుస్తోంది.

దంపతులకు నోటీసులు

దంపతులకు నోటీసులు

దీంతో ఈ ఖాతా సమాచారాన్ని భారత అధికారులకు తెలిపేందుకు అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో నామినీలను నియమించి వారి ద్వారా తెలియజేయాలని స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) పట్వార్ధన్ దంపతులకు నోటీసులు ఇచ్చింది.

వివరాలు ఇవి మాత్రమే...

వివరాలు ఇవి మాత్రమే...

సూపర్ డూపర్ హిందీ హిట్ సినిమా మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ పట్వార్ధన్ దంపతుల కుమార్తె. ఈ నెల 19వ తేదీన నోటీసుల వివరాలు స్విట్జర్లాండ్ గెజిట్‌లో ప్రచురితం అయ్యాయి. నామినీలను పది రోజుల్లో అపాయింట్ చేయాలని పేర్కొంది. దీనిపై సాంగ్లీ కుటుంబం నోరు విప్పాల్సి ఉంది. ఆ నోటీసుల్లో పేర్లు, పుట్టిన తేదీలు (ఆగస్ట్ 24, 1942 విజయ్ సింగ్ మాధవరావు పట్వార్ధన్, అక్టోబర్ 27, 1950 రోహిణి విజయసింగ్ పట్వార్ధన్) మాత్రమే ఉన్నాయి.

English summary

స్విస్ బ్యాంకులో మహారాష్ట్ర రాజ కుటుంబ దంపతులకు ఖాతా, అకౌంట్ వివరాలు అడిగిన భారత్ | Sangli royals under scanner for Swiss bank accounts

India's probe into Swiss bank accounts held by its citizens has taken a royal turn with the Indian authorities approaching Switzerland's tax department for details about two members of the ruling family of the erstwhile princely state of Sangli, now in Maharashtra.
Story first published: Monday, November 25, 2019, 10:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X