భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు ఒక ఆదేశం జారీ చేయడంతో, ఇటీవల సంచార్ సాథి (sanchaar sathi) యాప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ యాప్‌ను కొత్తగా అమ్మే అన్ని మొబైల్ ఫోన్లలో ముందస్తుగా (Pre-installed) ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే, గోప్యతా కార్యకర్తలు, ప్రతిపక్షాలు దీనిని పౌరులపై నిరంతర నిఘా ఉంచే 'బిగ్ బ్రదర్' చర్యగా అభివర్ణించడంతో ఈ అంశం పెద్ద వివాదానికి దారి తీసింది.

ఈ వివాదంపై కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టత ఇచ్చారు. మంగళవారం (డిసెంబర్ 2) ఆయన మాట్లాడుతూ, సంచార్ సాథి యాప్‌ను తమ డివైజ్ లలో ఉంచుకోవడం లేదా తొలగించడం పూర్తిగా యూజర్ల ఇష్టమని పేర్కొన్నారు. "మీకు సంచార్ సాథి వద్దు అనుకుంటే, మీరు దానిని డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఈ యాప్ ను ప్రతి ఒక్కరికీ పరిచయం చేయడం మా బాధ్యత. వారి డివైజ్‌లలో దానిని ఉంచుకోవడం లేదా తొలగించడం అనేది వాళ్ల ఇష్టం," అని మంత్రి సింధియా స్పష్టం చేశారు.
భద్రత కోసమే అంటున్న ప్రభుత్వం
ప్రభుత్వం మాత్రం ఈ సంచార్ సాథి యాప్ ను పౌరుల భద్రత కోసమే ప్రవేశపెడుతున్నట్లు వాదిస్తోంది. ఈ యాప్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే..
- అమ్ముడవుతున్న ఫోన్ల నిజాయితీని చెక్ చేయడం.
- ఫోన్ పోయినప్పుడు దానిని ట్రాక్ చేయడంలో సహాయపడటం.
- అనుమానాస్పద మోసాలు, అవాంఛిత మెసేజ్ లు, మాల్వేర్ లింక్‌లను నివేదించడం.
- మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడం.
ప్రతిపక్షం అభ్యంతరాలు
మరోవైపు, కాంగ్రెస్ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో ఈ సంచార్ సాథి అంశంపై చర్చించేందుకు ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలని అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి యాప్‌ను తప్పనిసరి చేయడం 'ఆందోళనకరం' అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా, నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రజలకు, పార్లమెంట్‌కు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
యాప్ డేటా ఇలా..
ప్రస్తుతం పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, సంచార్ సాథి యాప్ వివాదం ప్రతిపక్షానికి మరో ఆయుధంగా మారింది. అయితే, కేంద్ర మంత్రి సంచార్ సాథి ఐచ్ఛికమని చెప్పినప్పటికీ, మొబైల్ ఫోన్లలో ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయమని తయారీదారులను ఆదేశించడం వెనుక ఉన్న గోప్యతా సమస్యలు, టెక్ ప్రపంచంలో ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. పౌరుల భద్రత, గోప్యత రెండింటి మధ్య సమతుల్యతను సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇకపోతే.. సంచార్ సాథి యాప్, పోర్టల్‌ను 2023 నుండి ఉపయోగిస్తున్నరు. ఈ యాప్ ద్వారా 26 లక్షలకు పైగా పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్‌సెట్‌లను గుర్తించినట్లు వెబ్‌సైట్ డేటా పేర్కొంది. అనుమానాస్పద మోసాలను నివేదించడం, హానికరమైన వెబ్ లింక్‌లను బ్లాక్ చేయడం, పోగొట్టుకున్న ఫోన్‌ను ట్రాక్ చేయడంతో పాటు మీ పేరు మీద ఉన్న అన్ని మొబైల్ కనెక్షన్‌లను తెలుసుకోవడం వంటివి యాప్ చేసే ముఖ్యమైన పనులు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications