ప్రపంచంలోని అత్యంత విలువైన సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన సేల్స్‌ఫోర్స్, తన AI వ్యూహంలో కీలకమైన మార్పు చేసింది. విశ్వసనీయత సమస్యల కారణంగా.. కంపెనీ పెద్ద భాషా నమూనాల (Large Language Models - LLMs) పై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ.. తన ప్రధాన ఉత్పత్తి ఏజెంట్‌ఫోర్స్ (Agentforce) లో మరింత ఊహించదగిన, నియంత్రితమైన ఆటోమేషన్ (Deterministic Automation) వైపు మొగ్గు చూపుతోంది.
ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో AI మోడళ్లపై నమ్మకం తగ్గిందని సేల్స్‌ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్ఞా పరులేకర్ స్వయంగా అంగీకరించారు. ఒక సంవత్సరం క్రితం పెద్ద భాషా నమూనాలపై మేమంతా చాలా విశ్వాసంగా ఉన్నాము. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపారు.ఈ మార్పు వెనుక ప్రధాన కారణం..AI మోడళ్ల అప్రిడిక్టబుల్ ప్రవర్తన అని చెప్పవచ్చు. ఏఐని వాస్తవ ప్రపంచంలో ఉపయోగించినప్పుడు, కొన్ని సందర్భాల్లో మోడళ్ల సూచనలను విస్మరించడం, దృష్టి కోల్పోవడం, అనుకోని నిర్ణయాలు తీసుకోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి.

అయితే ఈ వ్యూహాత్మక మార్పు.. కంపెనీలో జరిగిన భారీ ఉద్యోగాల కోతల తర్వాత రావడం గమనార్హం. సేల్స్‌ఫోర్స్ తన సపోర్ట్ స్టాఫ్‌ను 9 వేల నుండి సుమారు 5 వేలకు తగ్గించింది. అంటే దాదాపు 4 వేల ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని CEO మార్క్ బెనియోఫ్ స్వయంగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెనియోఫ్ మాట్లాడుతూ..AI ఏజెంట్ల వల్ల నాకు తక్కువ మంది అవసరం అయ్యారు. అందుకే హెడ్‌కౌంట్‌ను గణనీయంగా తగ్గించానని చెప్పారు.
అయితే, AI ఉద్యోగాలను తగ్గించినప్పటికీ.. అదే AI ఇప్పుడు విశ్వసనీయంగా పనిచేయకపోవడం సేల్స్‌ఫోర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. ఏజెంట్‌ఫోర్స్ CTO మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు ఇచ్చినప్పుడు AI మోడళ్లు ఆదేశాలను పాటించకపోవడం ప్రారంభిస్తున్నాయి. ఇది ఖచ్చితత్వం అవసరమైన వ్యాపార పనులకు పెద్ద లోపంగా కనిపిస్తోందన్నారు.
ఉదాహరణకు చెప్పాలంటే 2.5 మిలియన్ల కస్టమర్లకు సేవలు అందించే గృహ భద్రతా సంస్థ వివింట్ (Vivint).. ప్రతి కస్టమర్ ఇంటరాక్షన్ తర్వాత సంతృప్తి సర్వేలు పంపమని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఏజెంట్‌ఫోర్స్ సర్వేలను పంపకపోవడం గమనించబడింది. చివరికి, స్థిరత్వం కోసం నిర్ణయాత్మక ట్రిగ్గర్‌లు అమలు చేయాల్సి వచ్చింది.
Salesforce ఎగ్జిక్యూటివ్ ఫిల్ ముయ్ AIలో కనిపిస్తున్న మరో సమస్యను.. AI డ్రిఫ్ట్ గా పేర్కొన్నారు. వినియోగదారులు సంబంధం లేని ప్రశ్నలు అడిగినప్పుడు, AI ఏజెంట్లు తమ అసలు లక్ష్యాన్ని మరిచి దారి తప్పుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు AIపై దూకుడుగా పెట్టుబడి పెట్టిన మార్క్ బెనియోఫ్‌కు.. ఈ మార్పు ఒక విరుద్ధమైన మలుపుగా మారింది. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సరైన డేటా లేకపోతే AI ఊహాజనితాలను సృష్టిస్తుందని ఆయన అంగీకరించారు. అందుకే AI మోడళ్ల కంటే డేటా ఫౌండేషన్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 2024 గరిష్ట స్థాయి నుంచి సేల్స్‌ఫోర్స్ షేర్ ధర దాదాపు 34 శాతం పడిపోయింది. అయితే ఏజెంట్‌ఫోర్స్ ద్వారా ఏడాదికి 500 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. పెద్ద భాషా నమూనాల నుంచి సేల్స్‌ఫోర్స్ తీసుకుంటున్న ఈ భాగస్వామ్య వెనుకడుగు.. ప్రపంచవ్యాప్తంగా AIపై ఆధారపడుతున్న వేలాది సంస్థలకు ఒక హెచ్చరికగా మారవచ్చు. AI హైప్‌కు మించి ప్రాక్టికల్ బిజినెస్ అమలు ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications