ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని మొదట అంచనా వేసింది. ఇప్పుడు దీనిని 7.3 శాతానికి కుదించింది. ద్రవ్యోల్భణం పెరుగుదల, అంచనాలకు మించి ఎక్కువ కాలం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగడమే ప్రధాన కారణమని ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది.
ద్రవ్యోల్భణం దీర్ఘకాలం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని తమ నివేదికలో ఎస్ అండ్ పీ తెలిపింది. దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవలసి ఉంటుంది. ఇది ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని, ఇది ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్భణం 6.9 శాతంగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక భారత వృద్ధి రేటు అంచనాల్లో వివిధ అంతర్జాతీయ సంస్థలు కోత పెట్టాయి. ప్రపంచ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 8.7 శాతం నుండి 8 శాతానికి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 9 శాతం నుండి 8.2 శాతానికి, ఆర్బీఐ 7.8 శాతం నుండి 7.2 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications