ప్రముఖ విమానయాన సంస్థ ర్యానెయర్ 3,000 ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాలు గ్రౌండ్‌కు పరిమితమయ్యాయి. దీంతో ఐరోపాలో పలు కేంద్రాలను క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వేతనం లేని సెలవులు, 20 శాతం వరకు ఉద్యోగాల కోతలు ఉన్నట్లు తెలిపింది.
ఏప్రిల్ నుండి జూన్ మధ్య 1 శాతం కంటే తక్కువ విమానాలను నడపనున్నట్లు తెలిపింది. దాదాపు జూలై వరకు విమానాలు గ్రౌండ్‌కే పరిమితమయ్యే అవకాశముందని అంచనా వేస్తోంది. మరో రెండేళ్ల పాటు అంటే 2022 వరకు ప్రయాణీకుల సంఖ్య పెరిగే అవకాశాలు తక్కువగా ఉందని అంచనా వేస్తోంది. వచ్చే 24 నెలల్లో అందుకోవాల్సిన విమానాల సంఖ్య విషయంలో బోయింగ్‌తో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రకటించింది.

కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ ఓ లీరీ మార్చి 2021 వరకు అంటే ఏడాది పాటు వేతనాన్ని 50 శాతం మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. పాసింజర్లు లేక ఈ సంస్థ విమానాలు 91 శాతం మైదానానికే పరిమితమయ్యాయి. కంపెనీ తొలగిస్తున్న 3,000 ఉద్యోగాల్లో పైలట్లు, క్యాబిన్ క్రూ కూడా ఉంది. ప్రయాణీకులు బుక్ చేసుకున్న £3.8 మిలియన్లు తిరిగివ్వాలని నిర్ణయించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications