ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ..భారత్ నుంచి రష్యా ఆశిస్తోన్న సహకారం ఇదే

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. రష్యాపై ఆంక్షల తీవ్రతా పెరుగుతోంది. యుద్ధం ఆరంభించిన తొలిరోజు నుంచే ఆరంభమైన ఆంక్షలు- మరింత తీవ్రతరం అయ్యాయి. మరింతగా విస్తరించాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాపై అన్ని రకాలుగా ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. ఆ దేశ విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి. రష్యా నుంచి దిగుమతులను పాక్షికంగా నిషేధించాయి.

రష్యాపై ఆంక్షల పర్వం..

రష్యాపై ఆంక్షల పర్వం..

రష్యన్ ఒలిగార్స్‌కు చెందిన అకౌంట్లను ఇటలీ స్తంభింపజేసింది. ఉక్రెయిన్‌కు హాని కలిగించడానికి ఉపయోగించే ఆయుధాలతో పాటు సైబర్ కార్యకలాపాల్లో వినియోగించే పరికరాలను ఇక ముందు రష్యాకు సరఫరా చెయ్యబోమని సింగపూర్ స్పష్టం చేసింది. వాటిపై తాత్కాలికంగా నిషేదం విదిస్తున్నామని సింగపూర్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. సైనికులు ఉపయోగించే వస్తులు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ జాబితాలోని అన్ని వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నామని సింగపూర్ తెలిపింది.

సోనీ మ్యూజిక్.. డిస్నీలాండ్

సోనీ మ్యూజిక్.. డిస్నీలాండ్

సోనీ మ్యూజిక్, డిస్నీలాండ్.. ఇవన్నీ రష్యాను బహిష్కరించాయి. ఆ దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ పేపాల్ కూడా తన సేవలన్నింటినీ రష్యాలో షట్‌డౌన్ చేసింది. తమ కంపెనీ సర్వీసులు ఏవీ కొంతకాలం పాటు రష్యాలో అందుబాటులో ఉండబోవని పేపాల్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. పేపాల్ బాటలోనే విసా, మాస్టర్ కార్డ్ కూడా నడిచాయి. ఈ రెండు సంస్థలు కూడా రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

 కార్పొరేట్ కంపెనీస్..

కార్పొరేట్ కంపెనీస్..

దీనికి కొనసాగింపుగా తాజాగా పలు కార్పొరేట్ కంపెనీలు రష్యాతో తెగదెంపులు చేసుకున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం కీలక ప్రకటన వెలువడించింది. రష్యాలో తమ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగు అకౌంటింగ్ ఫర్మ్స్‌లల్లో ఒకటైన డెలాయిట్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. రష్యాతో పాటు బెలారస్‌లోనూ తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడున్న సంబంధాలు ఎంతోకాలం పాటు కొనసాగబోవని తేల్చి చెప్పింది.

మైక్రోసాఫ్ట్ నుంచి టిక్ టాక్ దాకా..

మైక్రోసాఫ్ట్ నుంచి టిక్ టాక్ దాకా..

టాప్ అకౌంటింగ్ ఫర్మ్స్ ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్, ప్రైజ్ వాటర్ కూపర్స్, కేపీఎంజీ సైతం తమ కార్యకలాపాలను స్తంభింపజేశాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ కూడా అదే బాటలో నడిచింది. రష్యాకు చేయాల్సిన కార్ల ఎగుమతులన్నింటినీ నిలిపివేసింది. రష్యన్ సినిమా ప్రొడక్షన్ హౌసెస్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌లకు నెట్‌ఫ్లిక్స్ తాత్కాలికంగా పుల్‌స్టాప్ పెట్టింది. మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్, శామ్‌సంగ్, ఎయిర్ బీఎన్బీ, గూగుల్, వోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్ బెంజ్.. ఇదివరకే తమ సర్వీసులను నిలిపివేశాయి.

 ఆర్థిక సంక్షోభంలో..

ఆర్థిక సంక్షోభంలో..

ఈ పరిణామాలతో రష్యా ఆర్థిక పరమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన అనంతరం ఏర్పడినప్పటి ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు మళ్లీ చవి చూస్తోంది. ఈ క్రమంలో భారత్ వైపు చూపులు సారించింది. అత్యంత కీలకమైన చమురు, సహజవాయు రంగంలో మరిన్ని పెట్టుబడులను పెట్టాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రష్యా ఉప ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవాక్.. ఓ ప్రకటన విడుదల చేశారు.

కావాల్సినంత ఆయిల్..

కావాల్సినంత ఆయిల్..

భారత్‌కు ఇప్పటికే బిలియన్ డాలర్‌ మేర చమురు, సహజవాయును ఎగుమతి చేస్తోన్నామని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారత్‌కు చెందిన కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతులను ఇవ్వాలని చెప్పారు. అలాగే- కావాల్సినంత ముడిచమురు ఎగుమతి చేయడానికి కూడా తాము సంసిద్ధంగా ఉన్నామని అన్నారు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+