భారత్‌కు రష్యా కీలక భాగస్వామి: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ ఆ డీల్ తెర మీదికి

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. మూడోరోజు మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి. అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వారి దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడు అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.

రూ.5,124 కోట్ల డీల్..

రూ.5,124 కోట్ల డీల్..

ఈ పరిణామాల మధ్య రష్యాతో భారత్ కుదుర్చుకున్న డీల్ తెర మీదికి వచ్చింది. ఈ డీల్- రష్యా నుంచి ఏకే 203 రైఫిళ్లను కొనుగోలు చేయడం. దీని విలువ 5,124 కోట్ల రూపాయలు. ఈ రైఫిళ్లను కొనుగోలు చేయడానికి భారత్-రష్యా మధ్య ఒప్పందం సైతం కుదిరింది. దీనికోసం ఉద్దేశించిన ఒప్పందంపై రెండు దేశాలకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఒప్పందాలు కుదర్చుకున్నారు. రష్యాతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఉత్తర ప్రదేశ్‌ అమేథీ సమీపంలో గల కోర్వాలో ఉన్న యూనిట్‌లో ఈ రైఫిళ్లు తయారు కానున్నాయి.

కోర్వా వద్ద యూనిట్..

కోర్వా వద్ద యూనిట్..

అమేథీ సమీపంలోని కోర్వా వద్ద ఏకే రకానికి చెందిన శక్తిమంతమైన రైఫిళ్ల తయారీ యూనిట్‌ను చాలా సంవత్సరాల కిందటే నెలకొల్పింది రష్యా. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా రష్యా దీన్ని నెలకొల్పింది. ఈ యూనిట్‌లోనే రష్యా అవ్టోమాట్ కలష్నికోవ్ రైపిళ్లను తయారు చేసింది. ఏకే 47 సహా ఆ సిరీస్‌కు చెందిన అన్ని రకాల రైఫిళ్లు అమేథీ యూనిట్‌లోనే తయారవుతున్నాయి. ఈ యూనిట్‌ను మరింత విస్తరించడంతో పాటు ప్రొడక్షన్ కెపాసిటీని అధికం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

శక్తిమంతమైన ఏకే 203 అస్సాల్ట్ రైఫిల్స్..

శక్తిమంతమైన ఏకే 203 అస్సాల్ట్ రైఫిల్స్..

ఏకే 47 సిరీస్‌లో రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన ఏకే 203 అసాల్ట్ రకానికి చెందిన రైఫిళ్లు ఈ యూనిట్‌లో తయారవుతాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఆరు లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ఏడున్నర లక్షల ఏకే 203 రైఫిళ్లను రష్యా.. భారత ఆర్మీకి అప్పగించాల్సి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వాన్స్డ్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ అండ్ మ్యూనిటిషన్స్ లిమిటెడ్, రోసొబోరొన్ ఎక్స్‌పోర్ట్స్, కలష్నికోవ్ మధ్య ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి.

300 మీటర్ల రేంజ్‌లో..

300 మీటర్ల రేంజ్‌లో..

7.62 X 39 ఎంఎం క్యాలిబర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందీ ఏకే 203. ప్రస్తుతం సైన్యం ఇన్సాస్ రైపిళ్లను వినియోగిస్తోంది. మూడు దశాబ్దాల కిందటి నుంచి అవే అందుబాటులో ఉంటున్నాయి. వాటి స్థానంలో ఏకే 203ని అందుబాటులోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 300 మీటర్ల రేంజ్‌లో గల లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. ఇన్సాస్ రైఫిళ్లతో పోల్చుకుంటే ఇది తేలికపాటిది. వినియోగించడం కూడా సులువే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+