ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధానికి దిగింది. ఆరు ప్రధాన నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ పైన రష్యా దాడిపై అమెరికా సహా వివిధ దేశాలు మండిపడుతున్నప్పటికీ, చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం తగ్గడం లేదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. భౌగోళికంగా భారత్ వీటికి దూరంగా ఉన్నప్పటికీ, ఈ ఉద్రిక్తతలు భారత్ పైన, భారత ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం చూపుతాయి.
వాణిజ్యం నుండి చమురు ధరల వరకు ఎంతో ప్రభావం ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం నేరుగా భారత్ పైన ఉండటంతో పాటు ఇది అంతర్జాతీయ మార్కెట్ పైన, తదనుగుణంగా భారత్ పైన.. ఇలా రెండు విధాలా ఉటుంది.

యుద్ధంలో పాల్గొనకపోయినా ప్రభావం
ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది! ఒక దేశానికి మరో దేశం, ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య సంబంధాలు అల్లుకుపోయాయి. దీంతో ఏ ప్రాంతం లేదా ఏ దేశంలోని పరిస్థితి అయినా అంతర్జాతీయంగా ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తమంతా ఇప్పుడు అనుసంధానమై ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో భౌగోళిక రాజకీయ పరిణామాలు ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనని దేశాలపై కూడా పెను ప్రభావం చూపుతాయి.

ఈ దేశాల నుండి 90 శాతం దిగుమతులు
భారత్‌కు సంబంధించినంత వరకు రష్యా-ఉక్రెయిన్ ప్రభావం భారతీయ కుటుంబాలకు, అలాగే పాలకులకు పెద్ద తలనొప్పిగా పరిమణించవచ్చు. వాణిజ్యం పైన ప్రభావం పడితే, ఇక్కడి ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా దేశాలతో మనకు వాణిజ్యపరంగా సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల నుండి 90 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు నమోదవుతున్నాయి. భారత్‌లో ఎక్కువగా వినియోగించే నూనెలలో సన్‌ఫ్లవర్ ఉంది. పామ్ ఆయిల్, సోయా, ఇతర నూనెలను కూడా వినియోగిస్తారు. పామాయిల్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న నూనెలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది.
2021లో భారత్ 1.89 మిలియన్ టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో ఉక్రెయిన్ వాటా 70 శాతం, రష్యా వాటా 20 శాతం. మిగతా 10 సాతం అర్జెంటీనా నుండి వచ్చింది. భారత్ ప్రతి నెల కనీసం రెండు లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటుంది. భారత్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతుల పైన 60 శాతం ఆధారపడుతోంది.

భారత ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం
ఉక్రెయిన్ ఏడాదికి 17 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ సీడ్‌ను ఉత్పత్తి చేస్తోంది. రష్యా 15.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తోంది. ఈ దేశాలతో పోలిస్తే అర్జెంటీనా ఉత్పత్తి చాలా తక్కువ. ఇక్కడ 3.5 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ సీడ్‌ను ఉత్పత్తి అవుతోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోలేదు.
ఫిబ్రవరి-మార్చి కాలంలో సాధారణగా ఉక్రెయిన్ నుండి 1.5 మిలియన్ టన్నుల నుండి 2 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ సీడ్స్ షిప్‌మెంట్ అవుతాయి. ఇది భారత ఆయిల్ మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది. రష్యా-ఉక్రెయిన్ ప్రభావం మరో రెండు మూడు వారాలు కొనసాగితే ధరలు పెరిగే అవకాశముంటుంది.

గ్యాస్ దిగుమతులు, ఫార్మా రంగంపై ప్రభావం
భారత్‌కు అవసరమైన గ్యాస్ దిగుమతులు ఉక్రెయిన్ నుండి కూడా ఉన్నాయి. రష్యా నుండి కూడా కొంత దిగుమతులు ఉన్నాయి. ఈ ప్రభావం మనపై ఉంటుంది.
మరోవైపు, భారత్ నుండి ఉక్రెయిన్‌కు ఫార్మా ఎగుమతులు ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత ఉక్రెయిన్‌కు ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. రాన్‌బాక్సీ, సన్ గ్రూప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎగుమతి చేస్తాయి. ఉక్రెయిన్‌లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా ఉంది.

క్రూడాయిల్ ధరలు
ప్రస్తుతం బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 100 డాలర్లకు చేరువైంది. మన వద్ద మాత్రం నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్యారెల్ చమురు 120 డాలర్లకు కూడా చేరుకోవచ్చు. అప్పుడు మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications