ముడి చమురు ఉత్పత్తి తగ్గించే అంశంపై సౌదీ అరేబియాతో కూడిన ఒపెక్ గ్రూప్, రష్యా మధ్య ఒప్పందం కుదరగపోవడంతో సౌదీ.. ధరల పోరుకు తెరలేపింది. క్రూడాయిల్ ధరలను భారీగా తగ్గించింది. రేట్లను 20 సంవత్సరాల కనిష్టానికి కోత పెట్టింది. దీంతో సోమవారం చమురు ధరలు 30 శాతం వరకు పడిపోయాయి. ఓ దశలో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 31 డాలర్లు పడిపోయి, ఆ తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్భ్ యుద్ధం సమయం తర్వాత చమురు రేట్లు ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. సహజవాయువు రేట్లు కూడా పడిపోయాయి.
సౌదీ అరేబియా-రష్యా క్రూడాయిల్ యుద్ధం

ఇలా ప్రైస్ వార్
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా క్రూడాయిల్‌కు డిమాండ్ తగ్గింది. మార్కెట్లో క్రూడాయిల్ నిల్వలు పెరిగిపోయాయి. ధరలు మరింతగా పెరిగిపోతాయని భావించి సౌదీ నేతృత్వంలోని ఓపెక్.. ఉత్పత్తిని తగ్గించాలని ప్రతిపాదించాయి. ఇందుకు రష్యా ససేమీరా అన్నది. తాము ఉత్పత్తి తగ్గిస్తే అమెరికా చమురు ఉత్పత్తి సంస్థలు మార్కెట్లోకి వేగంగా వెళ్లే ప్రమాదముందని రష్యా ఈ ప్రతిపాదనకు నో చెప్పింది. దీంతో రష్యాపై సౌదీ ప్రైస్ వార్‌కు దిగింది.

ధరలు భారీగా తగ్గించిన సౌదీ
చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా తర్వాత రష్యా రెండో స్థానంలో ఉంది. రష్యా నో చెప్పడంతో ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు సౌదీ ధరల యుద్ధానికి దిగింది. దీంతో రేట్లు తగ్గించింది. అంతేకాదు ఉత్పత్తిని కూడా పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించిన రేట్లను బ్యారెల్‌కు 6 నుండి 8 డాలర్లు తగ్గించింది. దీంతో మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి.

20 డాలర్లకు పడిపోయే అవకాశాలు..
సౌదీ చర్య మార్కెట్లో కలకలం రేపింది. ధరలు పదేళ్ల కనిష్టానికి దగ్గరలో ఉంది. త్వరలో బ్యారెల్ 26 డాలర్లకు చేరుకోవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది చమురు రంగంలోని సంస్థలను దెబ్బతీసింది. పరిస్థితి ఇలాగే ఉంటే బ్యారెల్ ధర 20 డాలర్లకు పడిపోయే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమనే వాదనలు ఉన్నాయి.

ధరలు పతనమైతే ఆ దేశాలపై, ప్రాజెక్టులపై ప్రభావం
ధరలు భారీగా పతనమైతే క్రూడాయిల్ ఆదాయాలపై ఆధారపడిన దేశాలు భారీగా దెబ్బతింటాయి. అంతేకాదు, క్రూడాయిల్ అన్వేషణ ప్రాజెక్టులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. చమురు ధరలు గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 30 శాతం పడిపోయాయి.

భారత్‌కు ఇప్పటికిప్పుడు ప్రయోజనం ఉందా?
అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ భారత్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే లాభం లేదు. ముందు ముందు ఇదే ధరలు కొనసాగితే మాత్రం లాభమే. కానీ అక్కడ తగ్గగానే ఇప్పుడు ప్రయోజనం లేదు. దేశ చమురు అవసరాల్లో పదిహేను రోజులకు మించి నిల్వ చేసే అవకాశం లేదు. దీర్ఘకాలం కొనసాగితే లాభం.

భారత ఆర్థిక వ్యవస్థపై భారం
క్రూడాయిల్ ధరలు తగ్గితే భారత్‌కు ప్రయోజనమే. మన చమురు అవసరాల్లో 84% దిగుమతులు ఉంటాయి. నెల రోజుల్లో బ్యారెల్ ధర 20 డాలర్ల వరకు తగ్గింది. దీంతో ఏడాదికి చమురు దిగుమతి బిల్లు కనీసం రూ.3,000 కోట్ల డాలర్ల మేర తగ్గవచ్చు. అంటే దాదాపు రూ.2.20 లక్షల కోట్ల కంటే ఎక్కువ. బ్యారెల్ ధర ఒక డాలర్ తగ్గినా రోజువారీ చమురు దిగుమతి భారం రూ.3,000 కోట్ల వరకు తగ్గుతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఓదార్పు. క్రూడాయిల్ ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో ఉంటుంది. తగ్గితే లాభం, పెరిగితే భారం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications