రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందు ధరకే భారత్‌కు రష్యా చమురు!
భారత్‌కు రష్యా బంపరాఫర్ ఇచ్చింది. ఇప్పటికే క్రూడాయిల్‌ను భారీ తగ్గింపుకు ఇస్తామని రష్యా ప్రకటించింది. ఇప్పుడు మరింత తక్కువ ధరకే భారత్ కొనుగోలు చేయనుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్... రష్యా పైన ఆంక్షలు విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు భారీ తగ్గింపుకు చమురును ఎగుమతి చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. యుద్ధం నేపథ్యంలో ధరలు భారీగా పెరిగిన కారణంగా భారత్ కూడా రష్యా నుండి భారీ డిస్కౌంట్‌కు కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. అమెరికా మాత్రం దీనిని తప్పుపడుతోంది.
భారత్ చమురును రష్యా నుండి తగ్గింపుకు కొనుగోలు చేయడం తప్పేమీ కాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువైపు ఉంటున్నారో తెలుసుకోవాలని చెబుతోంది. చరిత్ర దీనిని గుర్తు పెట్టుకుంటుందని అంటోంది. ఉక్రెయిన్ పైన దండయాత్ర తర్వాత ఆంక్షల కారణంగా రష్యా ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ దేశం నుండి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దీంతో భారత్‌కు చౌక ధరకే చమురు విక్రయానికి సిద్ఫడింది. ర,్యా నుండి 30 బ్యారెళ్ల ముడి చమురు డిస్కౌంట్‌కు కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే భారత్‌ను మరింతగా ఆకర్షించి ఎగుమతులు పెంచాలని రష్యా భావిస్తోంది. ఇందుకు బ్యారెల్ ధరపై 35 డాలర్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు ఉన్న ధరకే చమురు సరఫరాకు ఓకే చెబుతోంది. ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఇందుకు రూపాయి-రూబుల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కానీ రష్యా నుండి భారత్ చమురు దిగుమతులపై అమెరికా ఆగ్రహంగా ఉంది. రష్యా పైన ఆంక్షలు ఉన్నాయని, వీటిని పక్కకు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. రష్యా నుండి డిస్కౌంట్‌కు చమురును కొనుగోలు చేయడం తమ ఆంక్షల పరిధిలోకి రాదని చెబుతోంది. కానీ ఇది సరైన పద్ధతి కాదంటోంది.


Click it and Unblock the Notifications