Russia Counters Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై కఠినమైన పదజాలంతో విరుచుకుపడిన సంగతి విదితమే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై భారీ సుంకాలు విధిస్తూ దూకుడుగా వెళుతున్నారు. భారత్ కూడా ధీటుగానే బదులిస్తూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో భారత్-రష్యా సంబంధాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపడం లేదు.ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విస్తరిస్తూ, మరింత బలపడుతున్నాయి.
ఒకప్పుడు రష్యా-భారత్ సంబంధాలు కేవలం సైనిక సహకారానికి మాత్రమే పరిమితమై ఉన్నాయనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రెండు దేశాల మధ్య బంధం రోజురోజుకీ బలపడుతూ, నమ్మకానికి ప్రతీకగా మారుతోంది. ఈ విషయాన్ని రష్యా సీనియర్ దౌత్యవేత్త.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ బహిరంగంగానే వెల్లడించారు.ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న రష్యా చార్జ్ డి'అఫైర్స్ రొమన్ బాబుష్కిన్ మా మార్కెట్లు భారత ఉత్పత్తులకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇక ప్రారంభిద్దాం... శ్రీగణేశుడే ప్రారంభిస్తున్నాడు అంటూ విలేకరులను ఉద్దేశించి ఆయన తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు. ఈ చిన్న వాక్యం ద్వారా భారత్ సంస్కృతిపై తనకు ఉన్న గౌరవాన్ని ఆయన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత ఉత్పత్తులకు మా మార్కెట్లు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. రష్యా-భారత్ సంబంధాల పునాది పరస్పర విశ్వాసంతో కూడుకున్నవని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

మిత్రులను కూడా అవమానించడంలో ట్రంప్ వెనుకాడడంలేదు. భారత్ రష్యా నుంచి చమురు కొంటే దానిలో తప్పేముంది? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు నేరుగా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు. రష్యా-భారత్ బంధం కేవలం వ్యాపార పరంగానే కాకుండా, రాజకీయ స్థాయిలో కూడా పెరుగుతోందని బాబుష్కిన్ సంకేతాలిచ్చారు.
ముఖ్యంగా రష్యా-ఇండియా-చైనా (RIC) మద్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని.. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి సవాలు విసరడానికి ఈ మూడు దేశాలు కలిసే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చమురు విషయానికి వస్తే.. మరో కీలక విషయం వెలుగులోకివచ్చింది. రష్యా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎవ్‌గెనీ గ్రీవా వెల్లడించిన ప్రకారం.. భారత్ రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు 5 శాతం తగ్గింపు ఇస్తున్నారు ఇది ఒక వాణిజ్య రహస్యం అయినప్పటికీ.. ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది.
ప్రపంచ దేశాల నుంచి ఇండియా ప్రతీ ఏడాది సుమారు 250 మిలియన్ టన్నుల చమురు దిగుమతి చేసుకుంటుంది. అందులో 40 శాతం వరకు రష్యానే సరఫరా చేస్తోంది. ఈ సరఫరాలో ప్రతి బ్యారెల్‌పై 5 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నామని గ్రీవా తెలిపారు. దీంతో పాటుగా చమురు వ్యాపారంలో వచ్చే షిప్పింగ్, బీమా సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశామని గ్రీవా తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఎన్నో ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఇది వారికి నచ్చడం లేదు. అయితే తాజాగా రష్యా మాత్రం భారత్‌కు ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చి తన మైత్రిని మరింత బలపరచింది.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications