For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crude Oil: చమురు సరఫరాదారులో రష్యాదే అగ్రస్థానం.. ఎందుకంటే..

|

భారత్ కు అతిపెద్ద చమురు సరఫరా దారుగా రష్యా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. వోర్టెక్సా ప్రకారం.. సౌదీ అరేబియా, ఇరాక్‌ స్థానాలను రష్యా అధిగమించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతం మాత్రమే.

ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌లో వివాదం చెలరేగినప్పటి నుంచి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిపై ఆధారపడటాన్ని కేవలం 2 శాతం కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు దాదాపు ఇది 30 శాతానికి పెరిగింది. "ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు $85 ఉంది. భారత వ్యాపారులు రష్యా నుంచి ముడి చమురును $65కు కొనుగోలు చేస్తున్నారు.

ఐదు వంతు

ఐదు వంతు

నవంబరులో భారత్‌ దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో ఐదు వంతు వాటా రష్యా నుంచి వచ్చింది. ఇరాక్‌ నుంచి రోజుకు 8,61,461 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 5,70,922, అమెరికా నుంచి 4,05,525 బ్యారెల్స్ చమురు దిగుమతి అయ్యింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాతే రష్యానుంచి భారత్‌కు చమురు దిగుమతి భారీగా పెరిగింది.

 దాదాపు 85 శాతం

దాదాపు 85 శాతం

భారతదేశం తన ముడి చమురులో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. మొత్తం అవసరం 250 మిలియన్ టన్నులు. నవంబర్ నెలలో, భారతదేశం రష్యా నుండి రోజుకు దాదాపు 10 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌ను కొనుగోలు చేస్తోంది. (ఇది నెలకు దాదాపు 5 మిలియన్ టన్నులు).

English summary

Crude Oil: చమురు సరఫరాదారులో రష్యాదే అగ్రస్థానం.. ఎందుకంటే.. | Russia continues to be the largest supplier of oil to India

Russia continues to be the largest supplier of oil to India. India has been buying crude oil from Russia since the start of the conflict in Ukraine.
Story first published: Sunday, December 11, 2022, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X