రష్యా-ఉక్రెయిన్ యుద్ద ప్రభావం భారత్ పైన పడుతుంది. చమురు ధరలు పెరుగుదల మొదలు దిగుమతి సుంకాలు పెరగడం వరకు వంటింటి బడ్జెట్ పైన ప్రభావం చూపనున్నాయి. సరఫరా గొలుసు దెబ్బతింటే ఆ ప్రభావం భారీగానే ఉండనుంది. ఉక్రెయిన్ పైన రష్యా సైనిక చర్య మరింతకాలం కొనసాగితే ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయి. చమురు, గ్యాస్ ధరలు 120 డాలర్లకు పెరిగే అవకాశముంది. వాణిజ్య చెల్లింపులు ఆలస్యమవుతాయి. ఉక్రెయిన్ పైన దాడుల నేపథ్యంలో రష్యా పైన అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాలతో వాణిజ్య, వ్యాపార సంపంధాలు ఉన్న సంస్థల్లో ఆందోళన ఉంది. వాటిల్లే నష్టం, ప్రస్తుత పరిస్థితి నుండి ఎలా తట్టుకోవాలనే అంశంపై కంపెనీలు దృష్టి సారించాయి.

ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే చమురు ధరలు పెరిగి, ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది. ఈ ధరలు పెరిగాయంటే రవాణా ఖర్చులు పెరిగి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అది అధిక ద్రవ్యోల్భణంకు దారి తీస్తుంది. పెట్రో ఉత్పత్తులు, నూనె ధరలు పెరుగుతాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహార, ఆహారేతర ఉత్పత్తుల ధరలు పెరిగి, రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ టార్గెట్ 2 శాతం నుండి 6 శాతాన్ని మించవచ్చు. ఆర్బీఐ అంచనాల ప్రకారం చమురు ధరలు పది శాతం పెరిగితే దేశీయ ద్రవ్యోల్భణం 0.3 శాతం పెరుగుతుంది. అప్పుడు వృద్ధి 0.2 శాతం చొప్పున తగ్గుతుంది. ఆర్బీఐపై ఇది ఒత్తిడిని పెంచుతుంది.
మన దేశానికి సౌదీ, ఇరాక్, మిడిల్ ఈస్ట్ నుండ 63.1 శాతం, ఆఫ్రికా నుండి 14 శాతం, నార్త్ అమెరికా నుండి 13.2 శాతం చమురు దిగుమతులు ఉన్నాయి.

ఈ ధరలు పెరగవచ్చు
ఉక్రెయిన్, రష్యా నుండి సన్ ఫ్లవర్, పామాయిల్ దిగుమతులు అధికంగా ఉంటాయి. అలాగే, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించి, ఈ పరిశ్రమపై ప్రభావం ఉంటుంది. రష్యా టీ వినియోగంలో 18 శాతం భారత్ నుండి ఎగుమతి అవుతాయి. ఎగుమతులకు ఇబ్బంది అవడంతో పాటు ఆంక్షల కారణంగా చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చు.
గత ఏడాది 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో ఉక్రెయిన్ వాటా 70 శాతం, రష్యా వాటా 20 శాతం. అర్జెంటీనా నుండి 10 శాతం. పరిస్థితి ఇలాగే కొనసాగితే నూనె ధరలు పెరగవచ్చు. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల సరఫరా స్తంభిస్తే, గోధుమల ధరలు పెరగవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద 24.2 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఎగుమతికి అవకాశముంది.
మొబైల్ ఫోన్ల తయారీలో వినియోగించే లోహం, పల్లాడియం ఎగుమతిలో రష్యా ముందు ఉంది. రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధిస్తే పల్లాడియం ధరలు పెరిగి, సెల్ ఫోన్ల పైన ప్రభావం చూపుతాయి.

భారత్‌కు అవకాశాలు కూడా
ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ నుండి గోధుమ, మొక్కజొన్న ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంక్షలతో ఎగుమతులు దెబ్బతినవచ్చు. అప్పుడు మన దేశంలో గిడ్డంగుల్లోని గోధుమలు ఎగుమతి చేసుకునే అవకాశం రావొచ్చు. ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్‌లు రష్యా నుండి గోధుమలు కొనుగోలు చేస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు అమలైతే గోధుమల ఎగుమతికి అవకాశం లభించవచ్చు.
భారత్‌కు రష్యా నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తుల్లో ఇంధనాలు, మినరల్ ఆయిల్స్, ముత్యాలు, రత్నాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, మెషినరీ మెకానికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఎరువులు ఉన్నాయి. ఉక్రెయిన్ నుండి వ్యవసాయ, మెటలార్జికల్, ప్లాస్టిక్-పాలీమర్స్ ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. ఇక ఫార్మా, ఎలక్ట్రికల్ మిషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, వెహికిల్స్ భారత్ నుండి రష్యాకు, ఫార్మా, మెషినరీ, కెమికల్స్, ఆహార ఉత్పత్తులు ఉక్రెయిన్‌కు ఎగుమతి అవుతాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications