For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 నెలల గరిష్టానికి... రూపాయి అదుర్స్, భారీగా లాభపడిన కరెన్సీ

|

డాలర్ మారకంతో మన కరెన్సీ రూపాయి వ్యాల్యూ ఈరోజు(ఆగస్ట్ 24,సోమవారం) బలపడింది. ఈ రోజు గరిష్టంతో 56 పైసలు లేదా 0.75 శాతం లాభపడింది. గత వారం ముగింపు 74.85తో పోలిస్తే ఈ రోజు 75.90 వద్ద ప్రారంభమైన రూపాయి ఆ తర్వాత 52 పైసల లాభంచే 74.32 వద్ద క్లోజ్ అయింది. ఇటీవల డాలర్ మారకంతో రూపాయి క్రమంగా బలపడుతోంది. ఈ రోజు దాదాపు 50 పైసలకు పైగా బలపడింది.

<strong>రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..</strong>రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..

మార్చి 18న తర్వాత గరిష్ట క్లోజింగ్

మార్చి 18న తర్వాత గరిష్ట క్లోజింగ్

కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెల నుండి మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. గత రెండు నెలలుగా రోజు రోజుకూ కోలుకుంటున్నాయి. మార్చి 18వ తేదీ తర్వాత డాలర్ మారకంతో రూపాయి రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను నమోదు చేస్తుండటం, అంతర్జాతీయంగా డాలర్ వ్యాల్యూ క్షీణించడం వంటి వివిధ కారణాలతో రూపాయి బలపడింది. ఆరు కరెన్సీల్లో డాలర్ ఇండెక్స్ 0.15 శాతం నష్టపోయి 93.11 వద్ద ట్రేడ్ అయింది.

ప్రయివేట రంగ బ్యాంకుల దూకుడు

ప్రయివేట రంగ బ్యాంకుల దూకుడు

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ప్రయివేటు రంగ బ్యాంకు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరిచారు. నేడు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా వంటి ప్రయివేటురంగ బ్యాంకుల 3 శాతం వరకు లాభపడ్డాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 400 పాయింట్లు అందుకుంది. అయితే కరోనా కేసులు 30 లక్షలకు చేరుకోవడంతో లాభాలు పరిమితమయ్యాయి.

చమురు ధరలు

చమురు ధరలు

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 0.60 శాతం ఎగిసి బ్యారెల్ ధర 45.20 డాలర్లు పలికింది. అంతకుముందు ముగింపు కంటే ఒక శాతం వరకు పెరిగింది. ఇక, ఆసియాలోని ఇతర కరెన్సీల విషయానికి వస్తే జపాన్ యెన్ 0.05 శాతం క్షీణించగా, చైనీస్ యువాన్, సింగపూర్ డాలర్ వరుసగా 0.09 శాతం, 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి.

English summary

5 నెలల గరిష్టానికి... రూపాయి అదుర్స్, భారీగా లాభపడిన కరెన్సీ | Rupee jumps to 5 month high of 74.32 against dollar

Making a sharp U-turn, the rupee soared 52 paise to settle at 74.32 (provisional) against the US dollar on Monday, in line with upbeat domestic equities and sustained foreign fund inflows.
Story first published: Monday, August 24, 2020, 20:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X