For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rupee Vs Dollar: డాలర్ మారకంతో రూపాయి మరింత క్షీణత

|

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో గురువారం అమెరికన్ డాలర్‌తో భారత కరెన్సీ రూపాయి మారకం వ్యాల్యూ 3 పైసలు క్షీణించింది. దీంతో డాలర్ కొనుగోలుకు మన కరెన్సీలో చెల్లించాల్సిన రేటు రూ.77.65కు చేరింది. ఇంట్రాడేలో అయితే ఎక్స్ఛేంజ్ రేటు రూ.77.76కు పెరిగినప్పటికీ, చివరలో కరెన్సీ విలువ కాస్త కోలుకుంది.

స్టాక్ మార్కెట్ల భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలు. ఫారెక్స్ మార్కెట్‌లో గత 10 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనం కావడం ఇది అయిదోసారి. ద్రవ్యోల్భణ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ నష్టాలు, చైనా లాక్ డౌన్, ఎఫ్‌పీఐలు వెనక్కి వంటి వివిధ అంశాలు రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్ నిన్న భారీగా నష్టపోవడంతో ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు పతనమైంది.

Rupee hits record low against US dollar

పాకిస్తాన్ కరెన్సీ కూడా దారుణంగా పతనమైంది. ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న పాకిస్తాన్ కరెన్సీ వ్యాల్యూ ఆల్ టైమ్ కనిష్టానికి పతనమైంది. అమెరికన్ డాలర్‌తో పాక్ కరెన్సీ 200కు చేరుకుంది. మున్ముందు మరింత క్షీణించే అవకాశాలున్నాయి.

English summary

Rupee Vs Dollar: డాలర్ మారకంతో రూపాయి మరింత క్షీణత | Rupee hits record low against US dollar

The Rupee on Thursday opened at a record low against the US dollar amid unabated foreign fund outflows and concerns over aggressive rate hikes by the US Federal Reserve to tame inflation.
Story first published: Friday, May 20, 2022, 8:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X