యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోతోంది. మంగళవారం భారీగా నష్టపోయి 73.29 వద్ద ముగిసింది. కరోనా వైరస్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు కోత నిర్ణయం ప్రభావం పడింది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో నిన్న కీలకమైన 73 స్థాయికి క్షీణించింది. తద్వారా 16 నెలల కనిష్టానికి పడిపోయింది.
బుధవారం డాలరు మారకంతో రూపాయి 22 పైసలు ఎగిసి 73.07 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్ కారణంగా రూపాయి వరుసగా మూడో రోజు కూడా నష్టపోయింది. సోమవారం నుండి బుధవారం వరకు మొత్తం 160 పైసలు పడిపోయింది.

దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాల నేపథ్యంలో ఇంట్రాడేలో రూపాయి 73.63 కనిష్టానికి పడిపోయింది. ఆసియా దేశాల కరెన్సీలో భారీగా నష్టపోతోంది భారత కరెన్సీ. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లపై, రూపాయిపై భారీగా ప్రభావం చూపుతోంది.
ఐఎన్జీ బ్యాంకు ఎన్వీ ప్రకారం కరోనా వైరస్ ప్రభావం ఆందోళనలు ఇలాగే కొనసాగితే త్వరలో డాలరు మారకంతో రూపాయి 75కు కూడా పడిపోవచ్చునని అంచనా. అక్టోబర్ 2018 రికార్డ్‌ను అధిగమిస్తుంది. ఇప్పటికే కరెన్సీ బుధవారం నాడు ఏడాది కనిష్టానికి పడిపోయింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

కుప్పకూలిన రూపాయి విలువ... చమురు ధరలు పెరగడంతో పడిపోయిన భారత కరెన్సీ..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..



Click it and Unblock the Notifications