డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ గురువారం నాటితో (8-ఏప్రిల్-2021) వరుసగా నాలుగు సెషన్‌లలో నష్టపోయింది. నిన్న రూపాయి 11 పైసలు క్షీణించి 74.58 వద్ద ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. డొమెస్టిక్ యూనిట్ ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో 74.38 వద్ద ప్రారంభమైన రూపాయి, రోజంతా 74.19 నుండి 74.93 మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 74.47 వద్ద క్లోజ్ కాగా, నిన్న 11 పైసలు క్షీణించింది.
దేశీయ కరెన్సీ రూపాయి అంతకుముందు రోజు (ఏప్రిల్ 7) భారీగా పతనమైంది. డాలర్ మారకంతో బుధవారం ఒక్కరోజే 105 పైసలు క్షీణించింది. గత 20 నెలల ఇంతస్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఆ రోజు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ మారకంతో 74.47కు పడిపోయింది. 2019 ఆగస్ట్ తర్వాత ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. నాడు ఆగస్ట్ 5న (2019) రూపాయి చరిత్రలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 13వ తేదీ తర్వాత ఇది కనిష్ట ముగింపు.

బుధవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 73.52 వద్ద ప్రారంభమై ఆ స్థాయి నుండి 74.50 పరిధిలో ట్రేడ్ అయింది. చివరికి 105 పైసల నష్టంతో 74.47 వద్ద ముగిసింది. ఆర్బీఐ రెపోరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఇటీవల చారిత్రక గరిష్ఠస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆర్థిక రికవరీపై అస్థిరత కనిపిస్తుందనే వ్యాఖ్యలు రూపాయిపై ప్రభావం చూపాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications