రూపే కార్డుపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆఫర్ ప్రకటించింది. రూపే కార్డు ద్వారా కొనుగోళ్లు చేస్తే 10 శాతం నుండి 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మేరకు రూపే ఫెస్టివ్ కార్నీవాల్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ సోమవారం ఆవిష్కరించింది. రూపే కస్టమర్లు ఈ కార్నివాల్‌లో తమ కార్డును ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ విధానంలో సురక్షితంగా నగదురహిత చెల్లింపులు చేయవచ్చునని NPCI తెలిపింది. వివిధ బ్రాండెడ్ వస్తువుల కొనుగోలుపై 65 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. సురక్షిత, నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపింది.

వీటిపై భారీ డిస్కౌంట్
ఆరోగ్యం, ఫిట్‌నెస్, విద్య వంటి వాటితో పాటు ఫుడ్ డెలివరీ, షాపింగ్, వినోదం, ఫార్మసీ తదితర వాటిపై రూపే కార్డు వినియోగదారులు ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. అమెజాన్, స్విగ్గీ, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్స్ పైన కస్టమర్లు 10 శాతం నుండి 65 శాతం మధ్య డిస్కౌంట్ పొందవచ్చును.

కార్నీవాల్ ఆకర్షణీయ ప్రయోజనాలు, డిస్కౌంట్లు
కార్నీవాల్ ఆకర్షణీయ ప్రయోజనాలు, డిస్కౌంట్లు కస్టమర్లకు పండుగ ఆనందాన్ని సరికొత్తగా అందిస్తాయని ఆశిస్తున్నామని NPCI మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవావాటియా ఓ ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో పండుగ కొనుగోళ్లపై డిజిటల్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు స్వీకరించేందుకు దోహదపడుతుందన్నారు. షాపింగ్, రోజువారీ కొనుగోళ్లలో భారతీయులు రూపే కార్డును మరింతగా వినియోగించేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

పండుగ సీజన్లో ఆఫర్ల వెల్లువ
దసరా, దీపావళి పండుగ సీజన్‌లో చాలామంది తమ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తారు. ఈసారి కరోనా కారణంగా గత ఆరేడు నెలలుగా ఏ రంగంలోను డిమాండ్ కనిపించలేదు. పండుగ సమయంలో డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం వాహన కంపెనీల నుండి బంగారం వ్యాపారుల వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు కూడా తమ తమ కస్టమర్లకు ఆఫర్లు ఇచ్చాయి. తాజాగా రూపే కార్డుపై 65 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తూ రూపే ఫెస్టివెల్ కార్నీవాల్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications