Onion Farmer: ఉల్లి సాగుతో కోటి రూపాయలు సంపాదించిన రైతు.. !
గత రెండు నెలలుగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మేలు రకం కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 పలుకుతుంది. సాధారణ ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60 కు విక్రయిస్తున్నారు. చిన్ని ఉల్లిగడ్డలు కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతున్నాయి. అయితే ఎప్పుడైనా ఉల్లి సాగు చేసే రైతులకు నష్టాలు మిగిలేవి. కానీ ఈసారి ఉల్లి సాగు చేసిన రైతులు కాస్త ఆనందంగా ఉన్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు ఉల్లి పంటతోనే రూ.కోటి రూపాయలు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఆ రైతు ఉల్లి సాగు చేసి, పంటను కాపాడుకుని, ఉల్లిని విక్రయించి తన అప్పులు తీర్చుకున్నట్లు చెబుతున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ జిల్లా సోటకనాల్ ఊళ్లో ప్రస్తుతం అందరు సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఆ ఊళ్లోని రైతులు చాలా మంది ఉల్లి సాగు చేయడం. ప్రస్తుతం ఉల్లికి భారీ ధర వారంతా తమ కష్టాన్ని మార్చిపోయి ఆనందంగా ఉన్నారు. ఆ గ్రామంలో ఎటు చూసినా ఉల్లిగడ్డలే కనిపిస్తున్నాయి. పొలాల్లో కనుచూపు మేర ఎర్రటి ఉల్లిపాయ రాశులు కనివిందు చేస్తున్నాయి. ఇదే గ్రామానికి చెందిన రుగీ అనే రైతు, ఆయన కుటుంబం తమకున్న 40 ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి పెట్టారు. ఆ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఉల్లిగడ్డలు భూమి నుంచి బయటకు తీశారు. కాడాలు కోసేసి ఉల్లిని మార్కెట్ కు తరలించారు.

ఇప్పటి వరకు దాదాపు 2500 క్వింటాల్లు ఉల్లిని మార్కెట్ కు తరలించి విక్రయించారు. సగటున క్వింటా రూ.4 వేలు చొప్పున విక్రయించారు. దీంతో రుగీ కుటుంబానికి ఉల్లి అమ్మగా కోటి రూపాయల ఆదాయం సమకురింది. రుగీ కుటుంబానికి గోధుమ, జొన్నలతో పాటు ఉల్లిపాయ సాగు చేస్తారు. అయితే వారికి ఉల్లి సాగులో ఎప్పుడైనా నష్టాలే వచ్చేవి. కానీ ఈసారి ధర బాగుండడంతో మంచి ఆదాయం వచ్చింది. అయితే ఆ కుటుంబం పంటను కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడాల్సి వచ్చింది. చివరికి వారి కష్టం ఫలించింది. దీంతో రుగీ ఆదర్శ రైతుగా మారిపోయారు. ఆయన స్ఫూర్తిగా సోటకనాల్ రైతులు భారీగా ఉల్లి సాగు చేస్తున్నారు.
ఈసారి ఉల్లి పంట వేసిన రైతులకు ఆదాయం బాగుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు, మూడు నెలల వరకు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని వారు చెబుతున్నారు. రైతులు ఉల్లితో పాటు కూరగాయలు సాగు చేస్తే కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications