భారతదేశంలో చాలామంది కలలు..కలలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నో కలలను యువత కంటున్నా ఆచరణలో వారికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి లగ్జరీ కార్లు అంటే ఇష్టం ,మరి కొందరికి లగ్జరీ బైక్స్ అంటే ఇష్టం. అయితే వాటిని కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నా..దానికి పడే ట్యాక్సులు చూసి గుండెలు బాదుకునే పరిస్థితి.. ఇప్పుడు ఇదే విషయాన్ని సుజయ్ యు అనే ఆర్థిక విశ్లేషకుడు తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పంచుకున్నాడు. భారతదేశంలో ట్యాక్స్ మూలంగా కలలు సాధ్యం కావడం లేదని రాసుకొచ్చాడు.
ఆయన పోస్ట్ చేసిన వివరాలను బట్టి చూస్తే.. ఒకరు జీవితంలో పోర్స్చే కారును కొనాలని కలలు కన్నాడు. అయతే దాని ధర రూ. 87 లక్షలు. దాన్ని చెల్లించడానికి అతను రెడీ అయ్యాడు, అయితే అది విదేశాల్లో ఉండటంతో దానిని భారత్ కు తీసుకురావడానికి, ఆ తరువాత దానికయ్యే ఖర్చును చూసి షాకవుతున్నాడని రాసుకొచ్చారు. పోర్స్చే కారుకు విదేశాల్లో 87 లక్షల రూపాయలు సరిపోతాయని అదే ఇండియాలో అయితే దాని ఖరీదు రూ. 3.13 కోట్లు అవుతుందని రాసుకొచ్చారు.

దీనికి కారణం ఏంటంటే.. భారతదేశపు పన్నుల భారం అని తెలిపారు. రూ. 87 లక్షలు కారు కాస్తా పన్నుల భారంతో రూ. 3.13 కోట్ల బిల్లుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వం మొదట విదేశాలలో తయ్యారయ్యే కార్లకు 125 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం విధిస్తుంది. అంతటితో ఆగుతుందా అంటే లేదు. అదనంగా 30% కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ, 4% అదనపు CVD, విపత్తు సుంకం, సెస్‌లు ఇలా అనేక రకాలైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని రాసుకొచ్చారు. అన్నీ అయ్యాక మళ్లీ 15% రాష్ట్ర రహదారి పన్ను కూడా వేస్తారు. ఇవన్నీ కలిపితే కారు ధర దాదాపు నాలుగు రెట్లు పెరుగుతుందని తెలిపారు.
మేము ప్రపంచంలోనే ఎక్కువగా భారతదేశంలోనే కార్లపై పన్నులు చెల్లిస్తున్నాం. కానీ వాటిని నడిపే రోడ్లు మాత్రం సరిగా లేవు.. గుంతలు, ధూళి, ప్రమాదాలతో ప్రతిక్షణం అవస్థలు పడుతున్నామని సుజయ్ వ్యాఖ్యానించాడు. ఇది కలలపై రక్తపాతాన్ని కలిగించే పన్ను వ్యవస్థ అని చెప్పుకొచ్చారు. 28 శాతం GST తో పాటు అదనపు సెస్‌లు స్థానిక వాహనాలపై కూడా అమలవుతున్నాయి. దీనిని స్థానిక తయారీదారులకు రక్షణ ప్రజల రక్షణ ఎక్కడ ఉంది అని ఆయన ప్రశ్నించారు.
ఇది పోర్స్చే కార్ గురించి మాత్రమే కాదని..మీ కలల బైక్, ఒక చిన్న ఎలక్ట్రిక్ కార్, లేదా మీ కుటుంబానికి సరిపడే స్మాల్ కారు కావచ్చు..ఏదైనా సమస్య అయితే మాత్రం మీ కలలపై పన్నుల రూపంలో జరిగే దాడి అని చెప్పుకొచ్చారు. దేశంలో రహదారి భద్రత లేదు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు ఖాళీగా ఉన్నాయి. కానీ పన్నులు మాత్రం ప్రపంచ స్థాయిలో వసూలవుతున్నాయి. వినియోగదారులు ప్రభుత్వ సేవల కోసం ప్రపంచాన్ని మించిన ఖర్చు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇది మిమ్మల్ని ప్రతిచోటా వెంటాడుతుందని సుజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మనం చెల్లించే పన్నులు ఎక్కడ పోతున్నాయి? ఎవరు బాధ్యత తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కథ ప్రతి భారతీయుడి కలలపై పన్నుల దాడి ఎలా జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చెబుతోంది. దీనిపై ప్రభుత్వ విధానాలు మారాలని నిపుణులు కూడా చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications