కరోనా మహమ్మారిపై పోరుకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, సంస్థల యజమానుల చేతుల్లో చేతుల్లో డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో నిన్న ఎస్ఎంఎస్ఈలకు రూ.3 లక్షల కోట్ల సహా మొత్తం రూ.6 లక్షల కోట్లను ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి.

రూ.6 లక్షలు కాదు.. ఇప్పటికే రూ.13 లక్షల కోట్ల ప్రకటన
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో నిన్న రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే దాదాపు రూ.13 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు అయింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో రూ.7 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. నిన్న ఎస్ఎంఎస్ఈలకు రూ.3 లక్షలు, మిగతా వాటికి రూ.3 లక్షలు ప్రకటించినందున మరో రూ.14 లక్షల కోట్లు ప్రకటిస్తారని భావిస్తుండవచ్చు. కానీ రూ.7 లక్షల కోట్ల వరకు ప్యాకేజీని గతంలో ప్రకటించారు.

ఇప్పటి వరకు ప్రకటించింది
కరోన మహమ్మారిపై పోరు కోసం నిర్మలా సీతారామన్ మార్చి నెలలో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో 80 కోట్ల మంది పేదలకు నేరుగా జన్ ధన్ అకౌంట్లలో వేసే నగదు లబ్ధి లేదా రేషన్ ప్రయోజనం వంటివి ఉన్నాయి. ఇది గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందుతోంది. ఆర్థిక వ్యవస్థలోకి మనీ ఇన్‌ఫ్యూజ్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఆర్బీఐ ఇప్పటికే రూ.5.24 లక్షల కోట్లు ప్రకటించింది. ఈ రెండు కలుపుకుంటే దాదాపు రూ.7 లక్షల కోట్లు గతంలో ప్రకటించారు. నిన్న నిర్మల రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అంటే మొత్తం ప్యాకేజీ ప్రకటన రూ.12.88 లక్షల కోట్లకు చేరుకుంది. మరో రూ.7.12 లక్షల కోట్లకు సంబంధించిన ప్రకటన చేయాల్సి ఉంది.

జీడీపీలో 10 శాతం
రూ.20 లక్షల ప్యాకేజీ జీడీపీలో 10 శాతం ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన ప్యాకేజీతో కోట్లాది మంది ఉద్యోగులకు, పేదలకు, 45 లక్షల చిన్న వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్, డిస్కం.. ఇలా ఎంతో మందికి లేదా ఎన్నో రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం చెబుతోంది. అయితే ఈ ప్యాకేజీపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తొలుత ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్లు జీడీపీలో 0.8 శాతం, ఆర్బీఐ ప్రకటించిన మొత్తం జీడీపీలో రూ.3.2 శాతం. గతంలో చేసిన ప్రకటనలు జీడీపీలో 4 శాతం వరకు ఉన్నాయి. మొత్తం రూ.20 లక్షల కోట్లు జీడీపీలో 10 శాతం.

ప్రపంచ అతిపెద్ద ఉద్దీపనల్లో ఒకటి
రూ.20 లక్షల కోట్ల కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్దీపనల్లో ఒకటి. అమెరికా తమ దేశ జీడీపీలో 13 శాతం, జపాన్ తమ దేశ జీడీపీలో 21 శాతం ఉద్దీపనలు ప్రకటించింది. ఆ తర్వాత ఇండియా జీడీపీలో 10 శాతం ప్రకటించింది.

ఆ రోజే రూ.2 లక్షల కోట్లు
రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సమయంలోనే ఎమర్జెన్సీ హెల్త్ రెస్పాన్స్ ప్యాకేజీగా రూ.15,000 కోట్లు ప్రకటించింది. ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్ పెండింగ్ మొత్తం రూ.18,000 కోట్లు. అంటే నిర్మల మార్చిలో ప్రకటన చేసిన సమయంలోనే రూ.2,03,000 ప్యాకేజీ వచ్చింది. ఈ లెక్కన రూ.13.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు అవుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications