సాధారణంగా ఎక్కువ జీతం వస్తే, పన్ను భారం కూడా పెరుగుతుందనేది సహజం. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త పన్ను విధానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, మీ జీతం రూ 18.50 లక్షలైతే కూడా ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించకుండా మినహాయింపులు తీసుకోవచ్చు.

మీ వేతనం రూ. 18.50 లక్షలైతే, కొత్త పన్ను విధానం ప్రకారం దాదాపు రూ. 1.61 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఇది ఎలాంటి మినహాయింపులు తీసుకోకముందు లెక్కించిన మొత్తం. ఈ మొత్తం నుంచి మొదటిగా స్టాండర్డ్ డిడక్షన్‌గా రూ. 75,000 మినహాయించుకోవచ్చు. అప్పుడు మీ ట్యాక్స్ లెక్కించాల్సిన ఆదాయం రూ. 17.75 లక్షలకు తగ్గుతుంది.
NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్):
మీ వేతనంలో బేసిక్ సాలరీ రూ. 9.25 లక్షలైతే, దానిపై కొన్ని ముఖ్యమైన డిడక్షన్లు తీసుకోవచ్చు. ముందుగా, NPSలో యజమాని తరఫున జీతం మీద 14% వరకు వచ్చే అమౌంట్‌కి డిడక్షన్ లభిస్తుంది. ఇది సుమారు రూ. 1,29,500 అవుతుంది. అలాగే, EPF (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్)లో యజమాని వేసే 12% అంచనా డిడక్షన్ కూడా ఉంటుంది. ఇది రూ. 1,11,000 వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ రెండు డిడక్షన్లు తీసుకున్న తర్వాత, ట్యాక్స్‌కు లెక్కించాల్సిన ఆదాయం సుమారుగా రూ. 15.34 లక్షలకు తగ్గిపోతుంది.
PPF, సుకన్య సమృద్ధి ఖాతాలు:
కొత్త టాక్స్ విధానంలో చాలా డిడక్షన్లు అందుబాటులో లేకపోయినా, కొన్ని పెట్టుబడులపై మాత్రం తగ్గింపులు లభిస్తాయి. ఉదాహరణకు, మీరు PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లేదా సుకన్య సమృద్ధి ఖాతాలో పెట్టుబడి పెడితే, దానిపై రూ. 17,500 వరకు డిడక్షన్ పొందొచ్చు. అలాగే, పోస్ట్ ఆఫీస్ వడ్డీపై కూడా రూ. 3,500 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ రెండు కలిపితే, ట్యాక్స్‌కు లెక్కించే మొత్తం ఆదాయం సుమారుగా రూ. 15.13 లక్షలకు తగ్గిపోతుంది.
రీఇంబర్స్మెంట్లు:
మీ కంపెనీ ఇచ్చే కొన్ని రీఇంబర్స్మెంట్లు కూడా పన్ను వర్తించే ఆదాయాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఉదాహరణకు: ఎంటర్టైన్మెంట్ ఖర్చులకు రూ. 30,000, రవాణా అలవెన్స్‌గా రూ. 70,000, పెట్రోల్, మొబైల్ బిల్లులకు రూ. 35,000, యూనిఫాం ఖర్చులకు రూ. 15,000. ఇలా మొత్తం కలిపితే రూ. 1.5 లక్షలు అవుతాయి. ఇవి కూడా మినహాయించుకుంటే, ట్యాక్స్‌కు లెక్కించే ఆదాయం సుమారుగా రూ. 13.63 లక్షలకు తగ్గిపోతుంది.
హోం లోన్ వడ్డీ డిడక్షన్:
మీ వద్ద అద్దెకు ఇచ్చిన ఇల్లు ఉంటే, ఆ ఇంటికి తీసుకున్న లోన్‌పై చెల్లిస్తున్న వడ్డీ మొత్తం అద్దె ఆదాయాన్ని మించి ఉంటే, ఆ తేడాను నష్టంగా చూపించి పన్ను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు హోం లోన్ వడ్డీగా రూ. 2 లక్షలు చెల్లిస్తే, అద్దె ఆదాయం రూ. 1 లక్ష వస్తే, మిగతా రూ. 1 లక్షను నష్టంగా చూపించి మినహాయించుకోవచ్చు. దీంతో మీ ట్యాక్స్‌కు లెక్కయ్యే ఆదాయం రూ. 12.63 లక్షలకు తగ్గుతుంది.
ఫ్యామిలీ పెన్షన్:
ఇంకా, మీకు ఫ్యామిలీ పెన్షన్ వస్తే అందులో రూ. 25,000 లేదా మొత్తం పెన్షన్‌లో మూడవ వంతు పన్ను నుండి మినహాయించవచ్చు. ఈ మినహాయింపు తర్వాత ట్యాక్సబుల్ ఆదాయం రూ. 12.38 లక్షలకు పడిపోతుంది.
సెక్షన్ 87A రిబేట్కు చేరుకోవడానికి తక్కువ గ్యాప్:
ఇప్పటికి మీరు ట్యాక్స్ రిబేట్ (సెక్షన్ 87A) పొందే పరిమితి అయిన రూ. 12 లక్షలకు చాలా దగ్గరలో ఉన్నారు. మీ ట్యాక్సబుల్ ఆదాయం కేవలం రూ. 38,000 మాత్రమే ఎక్కువగా ఉంది. దీన్ని మరికొన్ని మినహాయింపులు వాడుకుని తేలిగ్గా తగ్గించవచ్చు.
ఉదాహరణకు, అగ్నిపథ్ స్కీంలో పెట్టే కాంట్రిబ్యూషన్ పూర్తిగా ట్యాక్స్ మినహాయింపు పొందుతుంది (సెక్షన్ 80CCH(2)). మీ వద్ద రెండో ఇల్లు ఉంటే అది ఖాళీగా ఉన్నప్పుడు, దానిపై అద్దె వచ్చినట్టు చూపాల్సిన అవసరం ఉండదు. అలాగే, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి అయ్యాక కొన్ని షరతులు పాటిస్తే దానిపై వచ్చే మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతుంది. అలాగే, ఉద్యోగం నుంచి గెటే గ్రాచ్యుటీపై కూడా రూ. 25 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపులను సరిగ్గా ఉపయోగిస్తే, మీ ట్యాక్సుకు లెక్కించే ఆదాయాన్ని రూ. 12 లక్షల లోపే ఉంచవచ్చు. అప్పుడు పూర్తి పన్ను మాఫీ (టాక్స్ నిల్) లభిస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications