For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూయార్క్ లగ్జరీ ఫ్లాట్‌లో టెక్ కంపెనీ సీఈవో దారుణ హత్య

|

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని లగ్జరీ ఫ్లాట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ టెక్ కంపెనీ యువ సీఈవో దారుణ హత్యకు గురయ్యారు. అతను రవాణా, పుడ్ డెలివరీ సేవలు అందించే సంస్థకు సహ వ్యవస్థాపకులు. అతని పేరు ఫాహీమ్ సలేహ్‌గా గుర్తించారు. నగరంలోని విలాసవంతమైన ఫ్లాట్‌లో అతనిని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. అతని సోదరి అక్కడకు వచ్చేసరికి దుండగులు మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు.

ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు, భారీగా కుంగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లుముఖేష్ అంబానీ వ్యాఖ్యలు, భారీగా కుంగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు

అప్పటి వరకు అక్కడే నిందితులు

అప్పటి వరకు అక్కడే నిందితులు

విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును గమనించిన పోలీసులు అనుభవం కలిగిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఫాహీమ్ సోదరి అక్కడకు వచ్చే వరకు నిందితులు అక్కడే ఉన్నారని, ఆమె రావడం అలికిడని గుర్తించిన నిందితులు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా నిందితులు అతని వెనుకనే వచ్చినట్లు గుర్తించారు.

గోకడా సీఈవో...

గోకడా సీఈవో...

ఫాహీమ్ తండ్రి బంగ్లాదేశ్ నుండి వచ్చారు. అతను మోటార్ సైకిల్ రైడ్ హెయిలింగ్ అండ్ డెలివరీ యాప్ 'గోకడా' కంపెనీ సీఈవో. కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 100 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నైజీరియాలో గోకడ అనే సంస్థలు స్థాపించారు. గోకడలో 6.9 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. అతని వయస్సు 33. కాగా, ఈ హత్యకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకా ఎలాంటి అరెస్టులు జరగలేదని చెబుతున్నారు. అతని మొండెం వద్ద ఎలక్ట్రిక్ రంపాన్ని గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు అతని సోదరి మృతదేహాన్ని గుర్తించారు.

నాయకత్వ లక్షణాలు

నాయకత్వ లక్షణాలు

ఫాహీమ్ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవాడని, అందరికీ స్ఫూర్తి అని గోకడా ట్వీట్ చేసింది. అతను లేకపోవడం ఎంతో తీరని వేదన అని పేర్కొంది. అతను డెవలపింగ్ కంట్రీస్‌లోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే అడ్వెంచర్ కేపిటల్ వ్యవస్థాపక భాగస్వామి కూడా. మీడియా కథనాల మేరకు అతను హత్యకు గురైన ఆ ఫ్లాట్ ఇటీవలే 2.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు.

English summary

న్యూయార్క్ లగ్జరీ ఫ్లాట్‌లో టెక్ కంపెనీ సీఈవో దారుణ హత్య | Ride hailing app CEO found dismembered in New York flat

A Bangladesh origin tech entrepreneur and CEO has been murdered and his body dismembered in a luxury flat in New York city, according to media reports. He was 33 years old.
Story first published: Thursday, July 16, 2020, 13:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X