For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FY22లో ఆభరణాలకు భలే డిమాండ్, లాభాలు: ఎందుకంటే?

|

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.11,000కు పైగా తగ్గడంతో ఆభరణాల డిమాండ్‌లో వృద్ధి కొనసాగుతోందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. 2020-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే FY22లో రిటైల్ జ్యువెల్లరీ డిమాండ్ 30 శాతం నుండి 35 శాతం పెరగవచ్చునని పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్ ముందుస్థాయికి చేరడం దోహదపడుతోందని పేర్కొంది. పండుగ సీజన్‌కు తోడు వివాహాది శుభకార్యాలు, గరిష్ఠస్థాయి నుండి బంగారం ధరలు తగ్గడంతో గత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ పుంజుకుందని అభిప్రాయపడింది.

పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ ఇష్యూస్, ఇలా చేయవచ్చుపెరుగుతున్న డిజిటల్ పేమెంట్ ఇష్యూస్, ఇలా చేయవచ్చు

ప్రతికూలం నుండి స్థిరం

ప్రతికూలం నుండి స్థిరం

ఆభరణాల రంగం రేటింగ్‌ను స్థిరత్వం-ప్రతికూలం నుండి స్థిరత్వానికి సవరించింది. కరోనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా డిమాండ్ గణనీయంగా పడిపోవడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే FY22లో డిమాండ్ బలంగా పుంజుకుంటుందని పేర్కొంది. పసిడి ధరలు మరింత తగ్గుతుండటం కలిసి వస్తుందని వెల్లడించింది. అయితే 2019-20తో పోలిస్తే మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం(FY22) డిమాండ్ వృద్ధి ఐదు శాతం నుండి పది శాతంగా ఉండవచ్చునని పేర్కొంది.

ఆపరేటింగ్ మార్జిన్స్

ఆపరేటింగ్ మార్జిన్స్

FY21లోని మొదటి మూడు త్రైమాసికాల్లో టాప్ జ్యువెల్లర్స్ పూర్తి ఆపరేటింగ్ మార్జిన్స్ 7.7 శాతానికి పెరిగాయి. FY20లో ఇది 5.9 శాతంగా ఉంది. సెల్లింగ్, ప్రమోషనల్ ఖర్చులు తగ్గడం ఇందుకు దోహదపడింది. అద్దె సహా నిర్వహణ ఖర్చులు తగ్గడం FY22లో మార్జిన్ల వృద్ధికి దోహదం చేయవచ్చునని తెలిపింది.

అందుకే కలిసి రావొచ్చు

అందుకే కలిసి రావొచ్చు

చాలా జ్యువెల్లరీ కంపెనీలు కొత్త ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకున్నాయి. FY23కి వాయిదా వేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. తక్కువ లాభదాయకత ఉన్న పాయింట్స్‌ను విలీనం చేస్తున్నాయి. FY22లో డిమాండ్ పెరగడంతో పాటు కొత్త కేంద్రాలను పెద్దగా ప్రారంభించనందున వ్యయాల రూపేణా కలిసి రావొచ్చు.

English summary

FY22లో ఆభరణాలకు భలే డిమాండ్, లాభాలు: ఎందుకంటే? | Retail jewellers likely to sustain recovery with 35 percent growth in FY22: Report

Despite the steep fall in gold prices and the resultant fall in realisations, retail jewellers are likely to sustain the ongoing demand recovery into the next fiscal with a 30-35 per cent spike in demand, according to a report.
Story first published: Friday, March 19, 2021, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X