భారత రిటైల్ ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో అంచనాల కంటే పడిపోయి, భారీగా తగ్గింది. ఇంధనం, వంట నూనెలు సహా ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్భణం 7.79 శాతంగా నమోదయింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్టం. 2014లో నమోదైన 8.33 శాతం తర్వాత ఇదే అత్యధికం. 2021 ఏప్రిల్ నెలలో ఇది 4.23 శాతం మాత్రమే. ఆర్బీఐ నిర్దేశించుకున్న టార్గెట్ 2 శాతం నుండి 6 శాతం శ్రేణిలో గరిష్టస్థాయికి మించి ఈ ఏడాది జనవరి నుండి రిటైల్ ద్రవ్యోల్భణం నమోదవుతోంది.
అందుకే ద్రవ్యోల్భణం కట్టడి కోసం ఇప్పటికే కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ నెలలో ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్భణం (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్భణం ఈ ఏడాది మార్చి నెలలో 6.95, ఫిబ్రవరి నెలలో 6.07 శాతం, జనవరిలో 6.01 శాతంగా నమోదయింది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 8.38 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో ఇది 7.68 శాతం కాగా, 2021 ఏప్రిల్ నెలలో 1.96 శాతం. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్భణ రేటు మార్చి నెలలో 7.52 శాతం నుండి ఏప్రిల్ నెలలో 10.80 శాతానికి పేరిగింది. నూనెలు, ఫ్యాట్ విభాగాల్లో ధరలు 17.28 శాతం పెరిగాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications