నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
దేశీయ రిటైల్ ధరల ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. అక్టోబర్‌లో 4.62 శాతం నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 5.54 శాతానికి చేరుకున్నట్లుగా తాజా గణాంకాలు వెల్లడించాయి. వినియోగ వస్తు ధరల సూచిక (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.62 శాతం ఉండగా నవంబర్‌లో 2.33 శాతంగా నమోదైంది.
జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) వెల్లడించిన డేటా ప్రకారం... ఆహార పదార్థాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 10.01 శాతానికి చేరుకుంది. 2018 అక్టోబర్ నెలలో నమోదైన 7.89 శాతంతో పోల్చుకొంటే -2.61 శాతం తక్కువగా అని డేటాలో పేర్కొంది. కూరగాయల ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో 26.10 శాతం కాగా, నవంబర్ నెలలో 35.99 శాతంగా ఉంది.

గుడ్లు, సెరెల్స్ వంటి పదార్థాల ధరలు చాలా వేగంగా పెరిగాయి. వీటి ధరలు ఏకంగా 3.71 శాతం పెరిగాయి. మాంసం, చేపలు ధరలు ఏడాది పరంగా 9.38 శాతం పెరగగా, గుడ్లు నవంబర్ నెలలో 6.2 శాతం పెరిగాయి.
సీపీఐ, సీఎఫ్‌పీఐ ఆధారంగా ఆల్ ఇండియా ద్రవ్యోల్భణం రేటు ఇలా ఉంది. CPI ప్రకారం 2019 నవంబర్ నెలలో గ్రామీణ ప్రాంతంలో 5.27, పట్టణ ప్రాంతంలో 5.76, సరాసరి 5.54గా ఉంది. అక్టోబర్ నెలలో గ్రామీణ ప్రాంతంలో 4.29, పట్టణ ప్రాంతంలో 5.11, సరాసరి 4.62గా ఉంది. గత ఏడాది నవంబర్ నెలలో గ్రామీణ ప్రాంతంలో 1.71, పట్టణ ప్రాంతంలో 3.12, సరాసరి 2.33గా ఉంది.
CFPI ప్రకారం ఈ నవంబర్ నెలలో గ్రామీణ ప్రాంతంలో 8.83, పట్టణ ప్రాంతంలో 12.26, సరాసరి 10.01గా ఉంది. అక్టోబర్ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో 6.42, పట్టణ ప్రాంతాల్లో 10.47, సరాసరి 7.89గా ఉంది. నవంబర్ 2018లో గ్రామీణ ప్రాంతాల్లో -2.40, పట్టణ ప్రాంతాల్లో -3.04, సరాసరి -2.61గా ఉంది.


Click it and Unblock the Notifications