ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్భణం 5.91 శాతం
కూరగాయలు, గుడ్లు, మాంసం సహా వివిధ ఆహార వస్తువుల ధరలు తగ్గాయి. కరోనా కారణంగా కొన్ని ఆహార వస్తువుల ధరలు తగ్గితే, మరిన్నింటి ధరలు భారీగా పెరిగాయి. మొత్తానికి తగ్గుదల ఎక్కువగా ఉంది. దీంతో వరుసగా రెండో నెల రిటైల్ ద్రవ్యోల్భణం తగ్గి మార్చిలో 5.91 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.58 శాతంగా నమోదయింది. 2019 మార్చిలో ఇది 2.86 శాతంగా నమోదయింది.
వినియోగ ధరల సూచీ (CPI-కస్టమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 మార్చిలో 5.91% నమోదయ్యింది. రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 మార్చి ధరలతో పోల్చితే 2020 మార్చిలో పెరిగింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి కంటే తక్కువగానే ఉంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నిజానికి 2% ఉండాలి. అయితే ఈ స్థాయికి మైనస్ రెండు లేదా ప్లస్ రెండు కూడా తగిన స్థాయిగానే పరిగణిస్తారు.

కేంద్ర గణాంకాల ప్రకారం ద్రవ్యోల్భణం.. ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.82% ఉంది. కూరగాయలు 18.63%, పప్పులు, పప్పు దినుసులు 15.85%, తృణ ధాన్యాలు 5.30%, మాంసం, చేపలు 9.15%, పాలు, పాల ఉత్పత్తులు 6.47%, నూనె, కొవ్వు పదార్థాలు 7.54%, గుడ్లు 5.56%, సుగంధ ద్రవ్యాలు 9.82% ఉంది. నాలుగు శాతం లోపు విషయానికి వస్తే పండ్లు, చక్కెర, తీపి పదార్థాల ఉత్పత్తులు, అల్కాహాలేతర పానియాలు, ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications