భారత రెసిడెన్షియల్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ఇళ్ల అమ్మకాలు, కొత్త నిర్మాణాలు జనవరి-మార్చి త్రైమాసికంలో పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 44 శాతం వృద్ధిని నమోదు చేసి 71,963 యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కొత్త ప్రారంభంలో రికార్డ్ స్థాయిలో 76,006 యూనిట్లు నమోదయ్యాయి. లాంచింగ్స్, సేల్స్‌లో ముంబై, పుణేలు ముందున్నాయి. 2020 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2021లో ఇదే కాలంలో 44 శాతం వృద్ధిని నమోదు చేసింది.

హైదరాబాద్‌లో డిమాండ్
హైదరాబాద్‌లో ఇళ్లకు భారీగా డిమాండ్ కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 81 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. గత మూడు నెలల్లో 6,909 యూనిట్ల విక్రయాలు జరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ. ప్రధానంగా కరోనా ప్రభావం నుంచి హైదరాబాద్ రియల్టీ పూర్తిగా కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అమ్మకాలు
భాగ్యనగరంలో 2021 జనవరి - మార్చి త్రైమాసికంలో 9,349 యూనిట్లు లాంచ్ అయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 7,170, క్యూ3లో 1,234, క్యూ2లో 1,420 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి 211 శాతం లాంచింగ్స్‌లో వృద్ధి నమోదయింది. సేల్స్ చూస్తే హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 6,909 గృహాలు అమ్ముడయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 3,651, క్యూ3లో 1,609, క్యూ2లో 974 యూనిట్లు సేల్ అయ్యాయి. హైదరాబాద్, చెన్నై నగరాలు మినహా దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు క్షీణించినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.

స్టాంప్ డ్యూటీ తగ్గింపు
మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబై, పుణెల్లో అమ్మకాలను గణనీయంగా పెరిగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ముంబైలో 49 శాతం, పుణెలో 75 శాతం వృద్ధి కనిపించింది. ముంబైలో 23,752, పుణెలో 13,653 యూనిట్లు సేల్ అయ్యాయి. బెంగళూరులో 18 శాతం, చెన్నైలో 36 శాతం, ఢిల్లీలో 24 శాతం, కోల్‌కతాలో 22 శాతం, అహ్మదాబాద్‌లో 34 శాతం సేల్స్ పెరిగాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications