PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత జమ అప్పుడే..!
రైతులు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 23 విడతలుగా రైతులకు డబ్బులు అందజేశారు. 23 విడతల్లో మొత్తం రూ.46 వేలను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 23 విడత డబ్బులను ఈ ఏడాది జూన్‌లో జమ చేశారు. ఇప్పుడు 24వ విడతకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్‌లో 24వ విడత నిధులను కేంద్రం జమ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా ఎంత భూమి ఉన్న సంవత్సరానికి రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తారు. అయితే ఈ పథకంలో భాగంగా అర్హులకు మాత్రమే నిధులు జమ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వారు, ఆదాయం పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు. కాగా ఈ పథకంలో రైతుకు పీఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేకుంటే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావు. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోనివారు ఎవరైనా ఉంటే.. వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రూ.6 వేలు ఇస్తున్నారు. అయితే పథకం మొదలైనప్పటి నుంచి రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. వీటిని రూ. 12 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019 ఇప్పటి వరకు చాలా సార్లు ఎరువుల ధరలు పెరిగాయని, కూలీ ధరలు భారీగా పెరిగాయని.. అందుకే ఈ పథకంలో చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఏపీ అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అన్నదాతలకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.12 వేలు రైతులు ఖాతాల్లో జమ చేస్తోంది. సంవత్సరానికి రెండు సీజన్లలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ వర్షకాలం సీజన్ సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే రైతు రుణ మాఫీకి సంబంధించి రేవంత్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని రైతులు చెబుతున్నారు. చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications